India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పామర్రులోని ప్రగతి కాలేజీలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ బాలాజీ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ప్రతి ఒక్కరూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు, రెవెన్యూ శాఖ నుంచి ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పడనుంది. దిబ్బల సరిహద్దులు గుర్తించి రక్షణ చర్యలు చేపడుతుంది. 2014 నోటిఫికేషన్ ప్రకారం వీటిని వారసత్వ ప్రదేశాలుగా సంరక్షించాలని స్పష్టం చేసింది. జనసేన కార్పొరేటర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది.
జిల్లాలో అదనంగా 5 ఇసుక డిసిల్టేషన్ పాయింట్లకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ సిరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీ బెలగల్ మండలంలోని కొత్తకోట, సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్లదొడ్డి గ్రామాల్లో ఇసుక లోడింగ్‌కు అనుమతులు ఇచ్చామన్నారు. వినియోగదారుల కోసం జిల్లాలో 12 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు.
కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద వెంటనే బారికేడింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రిపూట ప్రమాదాల నివారణకు రోడ్లపై రోడ్ స్టడ్స్ (సూచికలు), సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ బి.వెంకటరమణ బాబు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌస్, రాంమోహన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ బుధవారం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. మహిళా బ్యారేక్‌ను పరిశీలించి మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పోషమ్మ పథకం అమలు చేస్తోందని, మహిళా ఖైదీలకు కూడా ఈ పథకం కింద ప్రత్యేక డైట్ ప్లాన్ అమలు చేసేలా పరిశీలిస్తున్నామని వివరించారు.
ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
తూ.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి హోమ్ స్టేలను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో ఈనెల 27న తెనాలిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MPDO అత్తోట దీప్తి బుధవారం తెలిపారు. VSR & NVR కాలేజీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మేళా నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటిఐ, డిగ్రీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు వచ్చే వారు సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫొటోతో రావాలని సూచించారు.
✦కొత్తమ్మతల్లి శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్
✦SKLM: మీ ప్రతిభతో ప్రధాని మోదీని కలవొచ్చు
✦ఎచ్చెర్ల: రోడ్డు అధ్వాన్నం.. ప్రయాణం నరకప్రాయం
✦జిల్లాలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
✦ సోంపేట నుంచి విజయవాడకు భవానీ దీక్షపరులు సైకిల్ యాత్ర
✦ కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఆలయంలో అపచారం
Sorry, no posts matched your criteria.