Andhra Pradesh

News August 25, 2025

కాశినాయన: బాల్ బ్యాట్మెంటన్‌లో సత్తా చాటిన విద్యార్థులు

image

రాజంపేటలో ఆదివారం జరిగిన బాల్ బ్యాట్మెంటన్ పోటీలలో కాశినాయన మండలం నరసాపురం ZPHS విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి కడప జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్స్ విభాగంలో ఇర్ఫాన్, సంపత్, సీనియర్ విభాగంలో సోహెల్ ఈ నెల 29, 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పలువురు అభినందించారు.

News August 25, 2025

గంజా అంటే.. ప్రకాశంలో చుక్కలే.!

image

ప్రకాశం జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గతంలో ఒంగోలు గంజాయికి అడ్డా అనే పేరు ప్రాచుర్యంలో ఉండేది. ఏ మేరకు వాస్తవం ఉందో కానీ, ఎస్పీ దామోదర్ సారథ్యంలో గంజా మాఫియా తాట తీస్తున్నారని ఒంగోలు ప్రజల మాట. ఆకస్మిక తనిఖీలతో పోలీసులు రంగంలోకి దిగుతుండగా, గంజా బ్యాచ్ ఊహించని స్థితిలో పట్టుబడుతోంది. మత్తు వదిలిస్తున్న ప్రకాశం పోలీస్ తీరును శభాష్ అనాల్సిందే.

News August 25, 2025

అనంత: CM ప్రోగ్రాం ఏర్పాటు స్థల పరిశీలన

image

సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు సెప్టెంబర్ 3న రానున్నారు. ఈ నేపథ్యంలో గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు పనులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించుకున్నారు.

News August 25, 2025

నేడు 5,57,710 డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

image

నిడదవోలులో సోమవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి మండలంలో స్థానిక ప్రతినిధుల ఆధ్వర్యంలో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 5,57,710 డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామన్నారు.

News August 25, 2025

యధావిధిగా పీజిఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.

News August 25, 2025

రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న సభ్యులు https://ganeshutsav.netలో అనుమతులు పొందాలని సూచించారు.

News August 25, 2025

విగ్రహాల ఏర్పాటు అనుమతులకు నేడు చివరి తేదీ: DSP

image

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం చివరి రోజు అని మచిలీపట్నం డీఎస్పీ సి.హెచ్. రాజా ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు సాయంత్రం 4 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 450 విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

News August 25, 2025

మచిలీపట్నం: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News August 25, 2025

కర్నూలు: DSC-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా

image

రేపటి రోజు జరగాల్సిన DSC-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వెరిఫికేషన్ తేదీనీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతుల మేరకు ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్సీ అభ్యర్థులు కీలక మార్పును గమనించి సహకరించాలని కోరారు.

News August 24, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ మోపిదేవిలో మహిళ ఆత్మహత్య
☞ మచిలీపట్నంలో రేపు గ్రివెన్స్: కలెక్టర్
☞ మచిలీపట్నంలో సైకిల్ చేసిన ఎస్పీ
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ  
☞ జాతియ స్థాయిలో నాగాయలంక క్రీడాకారుల సత్తా
☞ సెప్టెంబర్ 7న దుర్గ గుడి మూసివేత
☞ కృత్తివెన్నులో ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు