Andhra Pradesh

News April 16, 2024

కూరగాయలు అమ్మిన విజయసాయి రెడ్డి

image

ఇవాళ ఉదయం నెల్లూరు మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్లో YCP రూరల్, సిటీ MLA అభ్యర్థులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఖలీల్, MP అభ్యర్థి విజయసాయి రెడ్డి ప్రచారం చేశారు. వ్యాపారులు, కొనుగోలుదారులు, కార్మికులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉన్నత ప్రమాణాలతో మార్కెట్‌ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయసాయి రెడ్డి కూరగాయలు అమ్మగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనుగోలు చేశారు.

News April 16, 2024

విజయనగరం జిల్లా వ్యాప్తంగా 189 మంది వాలంటీర్స్ రాజీనామా

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా సోమవారం 189 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. రామభద్రపురం, బాడంగి, తెర్లాం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో వాలంటీర్స్ రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. వాలంటీర్స్ రాజీనామాలను ఆమోదించామని ఎంపీడీఓలు తెలిపారు. వ్యక్తి గత కారణాలతో కొందరు రాజీనామా చేయగా, ఎన్నికల కోడ్ పేరుతో తమను దూరంగా ఉంచడం వల్లే రాజీనామా చేశామని మరికొందరు తెలిపారు.

News April 16, 2024

ఈనెల 18 మడకశిరలో వైఎస్ షర్మిల పర్యటన

image

మడకశిర మండలంలో ఈనెల 18 పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు మడకశిరలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 16, 2024

18 నుంచి నామినేషన్లు స్వీకరణ: సబ్ కలెక్టర్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న ఎన్నికల కమిషన్ జారీ చేస్తుందని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరిస్తామని తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్‌కు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.

News April 16, 2024

తూ.గో.: 14 వరకు నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

image

సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని FDO రామకృష్ణ తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం, బలుసుతిప్ప గ్రామాల్లో 683 బోట్లు, కొత్తపాలెం పరిధిలో 309 బోట్లు ఉన్నాయన్నారు. జూన్ 14 వరకు వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 16, 2024

విశాఖ: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మధురవాడ దుర్గానగర్ కాలనీలో నమ్మి శ్రీకాంత్ (43) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న శ్రీకాంత్‌కు 2009లో వివాహం అయింది. ఏడాది తర్వాత భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి మద్యానికి బానిస అయ్యాడు. ఈనేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన పడక గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 16, 2024

గుంటూరు: 45 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

image

గుంటూరు పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల విధుల నిర్వహణకు 4600 మంది పోలింగ్‌ అధికారులను నియమించారు. ఇందులో సోమవారం మొదటి విడతగా 2300 మందికి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వని 45 మందికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

News April 16, 2024

ఎచ్చెర్ల: కౌన్సెలింగ్ డేట్ ప్రకటన

image

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశానికి మిగిలిన సీట్లు భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులు హాజరు కావాలని గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ బాలాజీ ప్రకటించారు. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులలో బాలురకు ఈనెల 18వ తేదీన దుప్పలవలస గురుకుల పాఠశాలలో, 19న బాలికలకు పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

News April 16, 2024

మన తూర్పుగోదావరిలోకి నేడు CM జగన్ ENTRY

image

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం బస్సు యాత్ర మంగళవారం తూ.గో.జిల్లాలో ప్రవేశించనుంది. జిల్లాలోని సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన లేఔట్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో రాత్రి బసచేస్తారు. 17న శ్రీరామనవమి నేపథ్యంలో ప్రచారానికి విరామం ప్రకటించారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకుంటారు.

News April 16, 2024

రాళ్లు వేయించుకుంటే సింపతీ రాదు: పెద్దిరెడ్డి

image

సీఎం జగన్‌పై సింపతీ ఎక్కడ పెరిగిపోతుందోనన్న భయం టీడీపీలో మొదలైందని.. అందుకే చంద్రబాబు తన మీద తానే రాళ్లు వేయించుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. సింపతీతో ప్రజలు ఓట్లు వేయరని ఆ ఘటన నిరూపించింది. సీఎం జగన్‌పై దాడి విషయంలో చంద్రబాబు, లోకేశ్ నీచంగా మాట్లాడుతున్నారు’ అని పెద్దిరెడ్డి మండిపడ్డారు.