Andhra Pradesh

News April 16, 2024

ఏలూరు: MS నారాయణ మరణించి నేటికి 9 ఏళ్లు 

image

తెలుగు సినిమా హాస్యనటుడు M.S నారాయణగా పిలవబడే మైలవరపు సూర్యనారాయణది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు. నేడు ఆయన జయంతి. ఎమ్మెస్ నారాయణ 1951 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన రచయితగా, దర్శకుడిగా, హాస్యనటుడిగా 17 సంవత్సరాలు సినీ రంగంలో సుమారు 700కు పైగా చిత్రాలలో నటించారు. అలాగే అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించారు.

News April 16, 2024

జగన్ పాలనలో శాంతి భద్రతలు లోపించాయి: గండి బాబ్జి

image

రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు లోపించాయని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గాజువాక ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో రాయితో దాడి చేయడానికి ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ సీఎం అయ్యాక దాడుల సంస్కృతి పెరిగిపోయిందన్నారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు.

News April 16, 2024

VZM: 15 రోజుల్లోనే విషాదం

image

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు మృతిచెందిన ఘటన పార్వీతీపురం మండలంలో జరిగింది. పెదమరికి గ్రామానికి చెందిన భుజంగరావు (45), ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ నడిపేవాడు. అతని కుమార్తె రోషిణి (19) తండ్రికి చేదోడుగా ఉండేది. మార్చి 31న భుజంగరావు మృతిచెందాడు. అప్పటి నుంచి సరిగా భోజనం చేయక, నిద్రపోకుండా ఉండిపోయింది. ఆదివారం రాత్రి నీరసంగా ఉందని నిద్రపోయింది. ఎంతకీ లేవకపోవడంతో తల్లి చూడగా అప్పటికే మృతిచెందింది.

News April 16, 2024

ప్రకాశం: రైలు పట్టా జారిపడి వ్యక్తి మృతి

image

జిల్లాలోని కురిచేడు మండలం మర్లపాలెం వద్ద రైల్వే ట్రాక్‌పై ఉన్న పాత పట్టాలను లారీలోకి లోడు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఒకటి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బిహార్‌కు చెందిన అనిష (40) రైలు పాత పట్టాలను లారీకి లోడ్ చేస్తుండగా, అతనిపై రైలు పట్టా జారి పడింది. క్షతగాత్రుడిని దర్శి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.

News April 16, 2024

కడప: కత్తులతో దాడి చేసుకున్న YCP, TDP వర్గీయులు

image

ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడులో YCP, TDP వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన నరసింహులు, శంకరయ్యల మధ్య ఇంటి స్థలానికి సంబంధించి 2ఏళ్లుగా వివాదం ఉండటంతో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికలు తెలిపారు. TDPకి చెందిన నరసింహులు, లక్ష్మీదేవి, చెంగమ్మ, నాగేశ్వరి, YCPకి చెందిన శంకరయ్య, నాగేంద్ర గాయపడ్డారు. కేసు నమోదు చేసినట్లు SI చిన్న పెద్దయ్య తెలిపారు.

News April 16, 2024

NTR: పవన్ కళ్యాణ్‌‌పై పోతిన మహేశ్ ఫైర్

image

ఢిల్లీ వెళ్లి తిట్లు తిని, చంద్రబాబుని CM చేయడానికి పవన్ నానా కష్టాలు పడినా క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పవన్‌ను పట్టించుకోవడం లేదని వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. అభిమానుల్ని జెండా కూలీలుగా మార్చి, నమ్మిన వారిని నట్టేట ముంచి విశ్వాసం చూపినా తెనాలిలో జరిగిన పవన్ సభకు అక్కడి టీడీపీ నేత ఆలపాటి రాజా హాజరు కాలేదన్నారు. టీడీపీ నేతలు పవన్ మొహం చూడటంలేదంటూ పోతిన పవన్‌పై ఫైరయ్యారు.

News April 16, 2024

కర్నూలు: 399 మంది వాలంటీర్ల రాజీనామా

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 339 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు 264 మంది రాజీనామా చేయగా.. 15న ఒక్కరోజే 135 మంది రాజీనామా చేశారన్నారు. సంబంధిత ఎంపీడీఓలు వారి రాజీనామాలను ఆమోదించారన్నారు. 15న రాజీనామా చేసిన వారిలో కోసిగి మండలంలో 46, కల్లూరు 38, మద్దికెర 3, తుగ్గలి 21, ఆదోని 16. కౌతాళం మండలంలో 11 మంది ఉన్నారని సీఈఓ తెలిపారు.

News April 16, 2024

NLR: కిరాక్ ఆర్పీపై కేసు నమోదు

image

జబర్దస్ ఫేమ్ కిరాక్ ఆర్పీపై నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈక్రమంలో తరచూ ప్రెస్‌మీట్లు నిర్వహించి వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కిందట వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News April 16, 2024

గుంటూరు మీదుగా సికింద్రాబాద్-సంత్రాగచి ప్రత్యేక రైలు.

image

వేసవికాలం ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి మంగళ, శనివారాల్లో సికింద్రాబాద్లో బయలుదేరి సంత్రాగచి బుధ, శనివారాల్లో చేరుతుందన్నారు. తిరిగి ఈనెల 21 నుంచి జూన్ 30వ తేదీ వరకు సత్రాగచిలో ప్రతి బుధ, ఆదివారాల్లో బయలుదేరి సికింద్రాబాద్ గురు, సోమవారాల్లో చేరుతుందన్నారు. 

News April 16, 2024

వీరఘట్టం: దరఖాస్తులకు గడువు ముగింపు

image

మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్ కే. జయప్రకాశ్ తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు స్వీకరణకు సోమవారంతో గడువు ముగిసిందని అన్నారు. మొత్తం 220 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు.