Andhra Pradesh

News April 16, 2024

పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌస్ దేశాయ్‌ రాజకీయ ప్రస్థానం

image

పాణ్యం సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌస్ దేశాయ్‌ స్వగ్రామం పెద్దకడబూరు మండలం కల్లుకుంట. బీఈడీ పూర్తిచేశారు. ఎస్ఎఫ్ఎలో చేరి విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. 1988లో సీపీఎం సభ్యత్వం పొందారు. అనేక ఉద్యమాలలో పాల్గొని నాయకత్వం వహించారు. 1993లో సీపీఎం సర్పంచిగా గెలిచేలా కృషి చేశారు. డీవైఎఫ్ఎ కర్నూలు నగర కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. సీఐటీయూ కర్నూలు నగర, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.

News April 16, 2024

విశాఖ: నేటి నుంచి కొత్త విమాన సర్వీసు ఏర్పాటు

image

విశాఖ- హైదరాబాద్ నూతన విమాన సర్వీసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 11.40 గంటకు విశాఖలో బయలుదేరి 12.50 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అంతకముందు అదే సర్వీసు రాత్రి 9.35 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11.00 గంటలకు విశాఖ వస్తుంది. విమానయాన ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.

News April 16, 2024

నల్లపాడు: పంట దిగుబడి రాలేదని మిర్చి రైతు ఆత్మహత్య

image

మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రైతు కన్నయ్య వెంగళాయపాలెం దగ్గర నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని అందులో మిర్చి పంట వేశాడు. సరైన దిగుబడి రాకపోవడం వలన తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య శాంతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 16, 2024

తాడిపత్రిలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అత్యధికంగా తాడిపత్రిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బీ.సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. పెద్ద వడుగురు మండలంలో 41.8 డిగ్రీలు, బొమ్మణహల్‌లో 41.6, శెట్టూరులో 41.2, చెన్నేకొత్తపల్లి, శింగనమల, గుత్తి, విడపనకల్ మండలాల్లో 40.2, ధర్మవరంలో 40.8, యాడికిలో 40.6, గుంతకల్లులో 40.3, బీ.సముద్రం మండలంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.

News April 16, 2024

UPDATE: ఏలూరు జిల్లా మేమంతా సిద్ధం యాత్రలో అపశ్రుతి

image

ఏలూరు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భీమడోలు మండలం పూళ్ల గ్రామ సమీపంలో బస్సుయాత్ర వెనక వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా స్లో అయ్యాయి. దీంతో వెనక నుంచి బైక్‌పై వస్తున్న గుండు నరేశ్ కాన్వాయ్‌లోని కారును ఢీ కొట్టాడు. ప్రమాద తీవ్రతకు నరేశ్ కారు వెనకభాగం నుంచి లోపలికి చొచ్చుకెళ్లాడు. గాయపడిన అతణ్ని అంబులెన్సులో ఆశ్రం వైద్యశాలకు తరలించారు.

News April 16, 2024

టీడీపీలో చేరిన దువ్వాడ సోదరుడు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు, పలాస 18వ వార్డు కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ ఆయన భార్య కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు, అచ్చెన్నాయుడు సమీక్షంలో వీరు టీడీపీ గూటికి చేరారు. యామలపేట సర్పంచ్ సంజీవ్ కుమార్, వైసీపీ టెక్కలి మండల మాజీ అధ్యక్షుడు, సర్పంచ్ బగాది హరిబాబు తదితరులు పసుపు కండువా కప్పుకొన్నారు.

News April 16, 2024

VZM: పోస్టుమాస్టర్ ఇంట్లో బంగారం చోరీ

image

కామాక్షినగర్ సమీపంలో నివాసం ఉంటున్న పోస్టుమాస్టర్ వెంకటరమణ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణ గజపతినగరంలోని తన బంధువుల ఇంటికి ఈ నెల 13న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని సోమవారం ఉదయం 7గంటల సమయంలో పక్కింటి వారు చూసి సమాచారం ఇచ్చారు. వెంకటరమణ వచ్చి చూసేసరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 16, 2024

తూ.గో.: YCP MLA అభ్యర్థి సమక్షంలో 900 వాలంటీర్లు రాజీనామా

image

మండపేటలో YCP MLA అభ్యర్థి తోట త్రిమూర్తులు వాలంటీర్లతో సమావేశం నిర్వహించగా నియోజకవర్గంలోని దాదాపు 1200 మంది హాజరయ్యారు. ‘వాలంటీర్లంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వైసీపీ ప్రచారంలో పాల్గొనండి. మళ్లీ వచ్చేది వైసీపీనే..అందరినీ విధుల్లోకి తీసుకుంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. రాజీనామా చేసేందుకు గేటువద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశారు. 900మందికిపైగా రాజీనామా చేసినట్లు సమాచారం. అనంతరం పట్టణంలో ర్యాలీ తీశారు.

News April 16, 2024

NLR: 2094 మంది వాలంటీర్లు రాజీనామా

image

ఎన్నికల తేదీ సమీపించే కొద్ది నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. పెద్దసంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో పలువురు టీడీపీలోనూ చేరారు. జిల్లాలో సోమవారం నాటికి 2094 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.

News April 16, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన MBA, MCA, MSC 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.