Andhra Pradesh

News April 16, 2024

కడప: వైసీపీలోకి మరో TDP మాజీ ఎమ్మెల్యే?

image

ఉమ్మడి కడప జిల్లాలో TDPకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రమేష్ రెడ్డి పార్టీని వీడారు. ప్రస్తుతం కమలాపురం మాజీ MLA వీర శివారెడ్డి YCPలోకి చేరుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కమలాపురం నుంచి 3సార్లు MLAగా గెలిచారు. TDP టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో TDPని వీడుతున్నాని సోమవారం ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీంతో ఆయన YCPలో చేరుతారా లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారా అనేది చూడాలి.

News April 16, 2024

నేను భయం, బాధ్యతతో పనిచేస్తా: చెవిరెడ్డి

image

‘నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించండి. భయంతో, బాధ్యతతో పని చేస్తాను’ అని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. కొమరోలులో సోమవారం రాత్రి వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఎన్నికల్లో పోటీ చేయటానికి సింగిల్‌గా సింహంలా వస్తున్నాడని, చంద్రబాబు పొత్తు పెట్టుకుని వస్తున్నాడని చెప్పుకొచ్చారు.

News April 16, 2024

ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావివ్వరాదు: కలెక్టర్

image

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నప్పుడే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదని కలెక్టర్ మనజీర్ జిలానీ సోమవారం సమూన్ అన్నారు. జిల్లా పరిషత్ మందిరంలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశాన్ని త్వరగా అవగాహన చేసుకోవాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

News April 16, 2024

ఎన్టీఆర్: సినీ ప్రియులకు గుడ్ న్యూస్

image

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ “జెర్సీ”(2019) ఈ నెల 20న విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విజయవాడ అలంకార్ థియేటర్‌లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. తిన్ననూరి గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జెర్సీ రీరిలీజ్ సందర్భంగా నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News April 16, 2024

వైసీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎస్సీ మోహన్ రెడ్డి

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

News April 16, 2024

భావనపాడు వరకు రోడ్డు సౌకర్యం: చంద్రబాబు

image

విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు సముద్రతీర ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపడతామని, బీచ్‌ని అభివృద్ధి చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలాస పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జీడి రైతుకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. డీఎస్సీ ఫైల్ పైనే మొదటి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పాల్గొన్నారు.

News April 16, 2024

ముగ్గురు వ్యక్తులు.. 5 వెహికిల్స్‌కే ఛాన్స్: కలెక్టర్

image

మార్చి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్లు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ప్రతిరోజు రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్ వేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులను, ఐదు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు.

News April 16, 2024

శ్రీకాకుళం జిల్లాలో పీడబ్ల్యూడీ ఓటర్లు@21,481

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజక వర్గాల వారిగా జిల్లాలో పీడబ్ల్యూడీ ఓటర్లు 21,481 ఉండగా.. జిల్లాలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు 11,485 ఓటర్ల ఉన్నట్లు కలెక్టర్ మంజీర జిలానీ సమూన్ పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నాయా లేదని రిటర్నింగ్ అధికారులను అడుగగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్లు ఆర్ఓలు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News April 16, 2024

అనకాపల్లి: ‘వైసీపీ పాలనలో అంతులేని అవినీతి’

image

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి కనిపించలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ మేరకు అనకాపల్లి గవరపాలెంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నియోజకవర్గంలో గత ఎన్నికలలో అమర్నాథ్‌ను గెలిపించి తప్పు చేశామని, ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

News April 16, 2024

18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల : కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 18వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు, అదే రోజు 11నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సంబంధిత కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలను అందుబాటులో ఉంచామన్నారు.