Andhra Pradesh

News April 16, 2024

ఉమ్మడి తూ.గో ఓటర్ల తీర్పు ఏంటో..?

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే నానుడి ఉంది. 2009లో కాంగ్రెస్-11, పీఆర్‌పి- 4, టీడీపీ-4 చోట్ల విజయం సాధించాయి. 2014లో టీడీపీ-13, వైసీపీ-5, ఇండిపెండెంట్-1 గెలిచాయి. 2019లో వైసీపీ-14, టీడీపీ-4, జనసేన-1 సీటు గెలిచాయి. మరి 2024లో ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందో కామెంట్ చేయండి.

News April 16, 2024

చిత్తూరు: సౌండ్ ఎక్కువ ఉన్న ప్రచార వాహనాలు సీజ్ చేయాలి

image

సౌండ్ ఎక్కువ ఉన్న ప్రచార వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. సోమవారం ఆర్వోలు , ఏఆర్ఓలు , నోడల్ అధికారులతో సోమవారం  సమావేశం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాలపై ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై అధికారులు పరిశీలించాలన్నారు.

News April 16, 2024

18 నుంచి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

ఈనెల 18వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎన్నికల అధికారి హరినారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.

News April 16, 2024

16న కోదండరామనికి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయని ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

News April 16, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం: కలెక్టర్, SP

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి గిద్దలూరు ఎంఆర్వో ఆఫీసు విజిట్ చేశారు. ఈసందర్భంగా ఆర్వో నాగజ్యోతి ద్వారా ఎన్నికల పర్యవేక్షణపై చేపట్టిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

News April 16, 2024

స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాష, ఎస్పీ రకుల్ జిందాల్ చెప్పారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. రూములు వద్ద తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఈవీఎం బాక్స్‌లను తరలించడానికి వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాక్సులు తరలించేటప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు.

News April 16, 2024

కృష్ణా: కేరళ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే

image

విజయవాడ మీదుగా ఈ నెల 17 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం విశాఖపట్నం-కొల్లామ్‌కు(నెం.08539) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో కొల్లామ్‌- విశాఖపట్నం(నెం.08540) మధ్య ఈ నెల 18 నుండి జూలై 4 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News April 15, 2024

మచిలీపట్నం: రేపు జిల్లాలో స్టేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సర్వే

image

ఈ నెల 16వ తేదీన జిల్లాలో ఎంపిక చేసిన 142 పాఠశాలల్లో స్టేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్టు డీఈఓ తాహేరా సుల్తాన తెలిపారు. సర్వేకు సంబంధించి సంసిద్ధత కార్యక్రమాన్ని స్థానిక కృష్ణవేణి ఐటీఐ కాలేజ్‌లో నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 142 పాఠశాలలకు చెందిన 3,299 మంది 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంలో ఏదైనా రెండు అంశాల్లో 90 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.

News April 15, 2024

నామినేషన్లకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని విభాగాల నోడల్ అధికారులతో కలిసి సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), ఈ ఆర్వోలతో వీసీ నిర్వహించారు.

News April 15, 2024

విజయవాడ సైబర్ పోలీసుల హెచ్చరిక

image

విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ముంబై సైబర్ పోలీస్ పేరుతో ఫోన్ చేసి ‘మీ పేరు మీద డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయి. మీరు అశ్లీల చిత్రాలు చూస్తున్నందుకు కేసు నమోదు చేశాం. మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు’ అని కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారని హెచ్చరించారు. అటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.