Andhra Pradesh

News April 15, 2024

17న శ్రీశైలంలో సీతారాముల కళ్యాణం

image

శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని శ్రీశైలం ఆలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 17వ తేదీన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. కళ్యాణోత్సవానికి ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించి గణపతి పూజ, గౌరీ పూజ, మాంగల్య పూజ, సీతారాముల కళ్యాణం ఉంటుందన్నారు.

News April 15, 2024

కాంగ్రెస్ పార్టీకి సీవీ శేషారెడ్డి రాజీనామా

image

పీసీసీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. అనుచరులతో సమావేశమై ఇకపై రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో ఉంటానన్నారు. సీవీ శేషారెడ్డి రెండు సార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు.

News April 15, 2024

గుంతకల్లు: 200 మంది వాలంటీర్ల రాజీనామా

image

గుంతకల్ పట్టణంలోని 4, 6, 18, 30వార్డులకు చెందిన, నెలగొండ, నాగసముద్రం, నక్కనదొడ్డి, N. కొట్టాల, N. వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన 200మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గుంతకల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేశారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించడానికి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.

News April 15, 2024

ప్రకాశం: రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి

image

ఉలవపాడు మండలం తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ట్రాక్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకుపచ్చ రంగు చీర ధరించినట్లు తెలిపారు.

News April 15, 2024

వైసీపీకి రాజీనామా చేసిన దువ్వాడ దంపతులు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ సోమవారం పలాసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా సేవలందించినా గడిచిన కొంతకాలంగా జరిగిన అవమానాలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News April 15, 2024

కృష్ణా: నాలుగో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 25,26, 27, 29 తేదీల్లో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

News April 15, 2024

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బుల్లె శివబాల

image

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు బుల్లె శివబాల నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News April 15, 2024

నేడు నందికొట్కూరులో బాలకృష్ణ రోడ్ షో

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నందికొట్కూరులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర’ పేరుతో ఆయన రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య, పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు కోసం నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతరం కర్నూలులో పర్యటిస్తారు.

News April 15, 2024

వివేకా హత్య కేసులో అనుమానాలు నివృత్తి చేయాలి: చైతన్య రెడ్డి

image

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలు అనుమానాలను సీబీఐ నివృత్తి చేయాలని నిందితుడు శంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్య రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఆయన ఈ కేసులో ఉన్న అనుమానాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. హత్య చేశానన్న దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేయడం సరికాదన్నారు. అసలైన నిందితులని అరెస్టు చేయాలన్నారు.

News April 15, 2024

ప్రకాశం: లాస్ట్ ఛాన్స్.. దరఖాస్తు చేసుకోండి

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన చివరి అవకాశం నేటితో ముగియనుంది. ప్రకాశం జిల్లాలోని 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకుల్లో ఓటర్ కార్డు లేని వారు ఆన్లైన్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశం కోల్పోతే మళ్లీ 5 సంవత్సరాల వరకు ఆగాల్సిందేనన్నారు.