Andhra Pradesh

News April 14, 2024

కార్వేటినగరం: SI వాహనం డ్రైవర్ ఆత్మహత్య

image

చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఎస్ఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. పాదిరికుప్పం గ్రామానికి చెందిన సందీప్(21) ఎస్ఐ పోలీసు వాహనానికి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ తన కుటుంబ కలహాల కారణంగా పద్మసరస్సు గ్రామం సమీపంలోని మామిడి తోటలో ఉరివేసుకున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నాడు.

News April 14, 2024

ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి: జడ్పీ ఛై‌ర్మన్

image

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పందించారు. మళ్లీ జగన్ సీఎం కాబోతున్నారని, సిద్ధం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అధికారంలోకి రావాలే కానీ.. జగన్‌ను భౌతికంగా దూరం చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన మంచి విధానం కాదన్నారు. మరో 30 ఏళ్లు జగన్ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు.

News April 14, 2024

విశాఖ: ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు

image

పరవాడ మండలం మూల స్వయంభువరం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, ఉప్పునీటి తుంపర్లు కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటినుంచి తమను రక్షించే వరకు తాము అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

News April 14, 2024

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : కలెక్టర్

image

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నెల్లూరు విఆర్సి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ ఒక దిక్సూచి నిలిచిపోయారని కొనియాడారు. సోషల్ వెల్ఫేర్ డిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2024

GREAT.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌తో అంబేడ్కర్ చిత్రం

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్‌తో గీసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన యార్లగడ్డ రాజారావు రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు, 128 సవరణలతో అంబేడ్కర్ చిత్రపటం రూపొందించారు. ఈ చిత్రపటాన్ని 2 రోజుల 11గంటల వ్యవధిలో గీసినట్లు రాజారావు చెప్పారు. రాజారావును పలువురు అభినందించారు.

News April 14, 2024

నరసరావుపేట: డివైడర్‌ను ఢీకొని ఇసుక లారీ బోల్తా

image

నరసరావుపేట పట్టణంలోని ఉప్పలపాడు బైపాస్ రోడ్డు వద్ద ఇసుక లారీ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆదివారం నరసరావుపేట నుంచి ఉప్పలపాడు వెళుతున్న ఇసుక లారీ డివైడర్ ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆ సమయంలో అటుగా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

News April 14, 2024

విజయనగరం: నాగార్జున అడుగులు ఎటువైపు..?

image

ఉన్నత చదువులు చదివి రాజకీయాల మీద ఆసక్తితో గత ఎన్నికల సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు కిమిడి నాగార్జున. కష్ట కాలంలో టీడీపీకి సేవ చేసిన ఆయనకు చివరికి మిగిలింది ఏమీ లేదని.. కనీసం ఈసారి పార్టీ తరఫున టికెట్ కూడా దక్కలేదని ఉమ్మడి జిల్లాలో ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. నాగార్జున రాజకీయ భవితవ్యం ఏమిటని.. ఆయన అడుగులు ఎటువైపు అన్న చర్చ అంతటా నడుస్తోంది.

News April 14, 2024

ఇప్పటి వరకు రూ.23.62 కోట్ల మేరా సీజ్: కడప ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, దాడుల్లో 23.62 కోట్ల రూపాయల నగదు, బంగారు ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 1.15 కోట్ల రూపాయల మద్యం, 5.50 లక్షల రూపాయల విలువ గల గంజాయి, 12 కోట్ల నగదు, 11.13 కోట్ల బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు

News April 14, 2024

అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం:డీఆర్‌ఓ

image

శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డీఆర్ఓ గణపతి రావు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థినికి జిల్లా రెండో ర్యాంకు

image

ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన డీ.హమీదా జిల్లా రెండో ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ 987/1000 మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చదువు మధ్యలో తండ్రి చనిపోవడంతో నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి తన తల్లి, అన్న ప్రోద్బలంతో ఉన్నతమైన ర్యాంకును సాధించి అందరిచేత ప్రసంశలు అందుకుంది.