Andhra Pradesh

News April 14, 2024

అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దాం: కలెక్టర్

image

రాజ్యాంగ స్ఫూర్తితో అంబేడ్కర్ సేవలను కొని అడుగుదామని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కర్నూలులోని పెద్ద బస్టాండ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతరం అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

News April 14, 2024

నెల్లూరు: వాట్సాప్‌లో విద్యుత్ సేవలు

image

వాట్సాప్ నంబరు ద్వారా విద్యుత్ శాఖకు సంబంధించిన పలు సేవలు పొందవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు ఎస్ఈ విజయన్ తెలిపారు. 91333 31912 నంబరుతో వాట్సాప్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. వినియోగదారుడు తమ 13 అంకెల సర్వీస్ నంబర్ ను వాట్సాప్ లో పంపితే అందుబాటులో ఉన్న సేవల ఆఫ్షన్లు వస్తాయన్నారు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోవచ్చన్నారు.

News April 14, 2024

ఆకాశాన్నంటుతున్న నూజివీడు రసాల ధరలు

image

మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూజివీడులో చిన్నరసాల ధర (డజన్) రూ.300 నుంచి రూ.350 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నల్ల తామర వ్యాప్తితో ఈ ఏడాది మామిడి పూత చాలావరకు మాడిపోయింది. దీంతో దిగుబడి పడిపోయి.. ఊరగాయకు సైతం కాయలు దొరకని పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ధరలను చూస్తుంటే ఇక ఈ ఏడాది మామిడి పండ్లు తినడం ‘భారమే’నంటున్నారు.

News April 14, 2024

నేడు తెనాలి రానున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తాజాగా ఖరారైనట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పవన్ తెనాలి రానున్నారు. ఆయన తెనాలి రావడం ఇదే తొలిసారి కావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా తెనాలి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్ వద్దకు పవన్ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News April 14, 2024

శ్రీకాకుళంలో తీవ్ర వడగాల్పులు

image

రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 151 మండలాల్లో మోస్తరుగా.. 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. రేపు 135 మండలాల్లో స్వల్పంగా.. 33 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళంలో వడగాల్పులు ఉండనున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించింది.

News April 14, 2024

కడప: భర్తతో గొడవ పడి వివాహిత సూసైడ్

image

కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్న ఉదయగిరి కుల్లాయమ్మ అనే వివాహిత శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 12వ తేదీన రాత్రి ఆమె భర్త కుల్లాయప్ప ఆమెతో గొడవ పడి 11 నెలల కుమారుడిని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News April 14, 2024

ఫోన్‌ రిపేర్ షాప్ యజమాని పెళ్లి.. శుభలేఖ వైరల్

image

వినూత్న ఆలోచనలతో ఎవరి అభిరుచికి తగినట్లు వారు శుభలేఖలు తయారు చేయించుకుంటున్న కల్చర్ ఈ మధ్య ఎక్కువైంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మొబైల్ రిపేర్‌ షాపు యాజమాని ఒకరు ఇలాగే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్నట్లు పెళ్లికార్డు ముద్రించుకున్నారు. అమలాపురం బ్యాంక్‌ స్ట్రీట్‌లో సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపు నిర్వహిస్తున్న అంబాజీపేట మండలం జి.అగ్రహారానికి చెందిన మణి-మధురిమ పెళ్లికార్డు అచ్చం ఫోన్‌ను పోలినట్లు ఉంది.

News April 14, 2024

శ్రీకాకుళం: చెరువులో చేపల వేటకు పోటీపడ్డ గ్రామస్థులు

image

నందిగాం మండలం పాత్రునివలస గ్రామానికి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువులో ఆదివారం చేపలు పట్టేందుకు గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామ పెద్దల ఆదేశాల మేరకు ఉదయం గ్రామంలో ఉన్న వారంతా చెరువులో చేపలు పట్టేందుకు ఒక్కసారిగా వందలాది మంది చెరువులో దిగి పోటీపడ్డారు. ఇలా ఒక్కసారిగా చేపలవేట సాగిస్తున్న గ్రామస్థులను అటుగా వెళుతున్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూశారు. ఈ రోజు గ్రామమంతా చేపల కూరే మరీ.

News April 14, 2024

విశాఖ: టీడీపీలోకి అక్కరమాని విజయనిర్మల..!

image

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. VMRDA ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణపై ఓడిపోయారు.

News April 14, 2024

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు కలెక్టర్ నివాళులు 

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అదితి సింగ్, ఆర్డిఓ నిశాంత్ రెడ్డి తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.