Andhra Pradesh

News April 14, 2024

నెల్లూరు: 61 మందికి 9 మందే పాస్

image

పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఈ ఏడాది 61 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాశారు. వారిలో కేవలం 9 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 56 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 28 మంది పాస్ అయ్యారు. కళాశాలలో అన్నీ వసతులున్నా చాలా తక్కువ మంది ఉత్తీర్ణులు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News April 14, 2024

పెద్దముడియం: భార్య గొంతు కోసి హత్యచేసిన భర్త

image

పెద్దముడియం మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో భార్యను ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. దిగువ కల్వటాలకు చెందిన ఆదిలక్ష్మికి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన మేనమామ సహదేవుడితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదిలక్ష్మి 2 నెలలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. భార్య సంసారానికి రాలేదన్న కోపంతో శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆదిలక్ష్మిని భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

News April 14, 2024

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

image

వెల్దుర్తి మండల కేంద్రంలోని సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన చంద్రనారాయణ (జేఎల్ఎమ్), డోన్‌లో నివాసముంటున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్రవంతి శుక్రవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. శనివారం స్రవంతి తమ్ముడు, తల్లి, మరికొందరు వెల్దుర్తికి వచ్చి చంద్రనారాయణ ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని ఆ జంట కర్నూలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.

News April 14, 2024

విశాఖ: పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.

News April 14, 2024

విశాఖ: రైల్వే స్టేషన్లలో తాగునీరు

image

రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని రైల్వే స్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ ఫామ్స్ పై తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, స్కౌట్ గైడ్స్, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో సాధారణ బోగీలు వద్ద చల్లని తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 14, 2024

సర్‌బుజ్జిలి యువకుడి కిడ్నాప్ కలకలం

image

వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం విశాఖలో క్యాబ్‌ బుక్ చేసుకొని బీజేపీ కార్యాలయం వద్ద ఉండగా అప్పుడే కారులో ఐదుగురు అతడిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

News April 14, 2024

నెల్లూరు: సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన మెరైన్ పోలీస్

image

సైదాపురం మండలం తూర్పుపూండ్లకు చెందిన హుస్సేన్ బాషా స్నేహితులతో కలిసి శనివారం కోడూరు బీచ్ కు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన మెరైన్ కానిస్టేబుల్ పోలయ్య వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చాడు. సీపీఆర్ చేసిన అనంతరం చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సకాలంలో స్పందించిన పోలయ్యను పలువురు అభినందించారు.

News April 14, 2024

తూ.గో జిల్లాలో మొత్తం ఓటర్లు 16,16,918 మంది

image

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 16,16,918 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,89,443, మహిళలు 8,27,380, ఇతరులు 95 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 19,726 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,533 మంది కాగా.. మహిళలు 8,192 మంది ఇతరులు ఒకరు ఉన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్లు వయస్సు దాటిన వారు మొత్తం 8,284 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,536 మంది కాక మహిళలు 4,748 మంది ఉన్నారు.

News April 14, 2024

విశాఖ: జూన్ 14 వరకు చేపల వేట నిషేధం

image

విశాఖ జిల్లాలో ఈనెల 14 అర్ధ రాత్రి నుంచి జూన్ 14 వరకు చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. చేపల పునరుత్పత్తి సమయంలో వాటి సంరక్షణకు ఏటా 61 రోజుల పాటు వేటను నిలిపివేస్తుంది. ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ సమయంలో చేపలు వేటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 14, 2024

ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని

image

దేవనకొండ మండలం తెర్నెకల్‌లోని పేద కుటుంబానికి చెందిన కిరణ్, జయలక్ష్మి దంపతుల కూతురు అనూష ఆరెకల్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. మంచి మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.