Andhra Pradesh

News April 14, 2024

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో తిరుపతి కలెక్టర్

image

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహు కేతు పూజలు చేయించారు. దర్శనం అనంతరం స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ వి నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

నకిలీ కథనాల ప్రచురణ కోడ్‌ను ఉల్లంఘించడమే: కడప కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమీషన్ ప్రత్యేక దృష్టి సారించిందని  కలెక్టర్ విజయ్ రామరాజు శనివారం పేర్కొన్నారు. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, లా & ఆర్డర్, ఎన్నికల సమగ్రత, ఎన్నికల ప్రణాళిక అంశాలపై నకిలీ కథనాలు ప్రసారం చేయద్దన్నారు. 

News April 14, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూంను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

కొత్త కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూంలో ఎంసీఎంసీ, సోషల్ మీడియా, డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, పోలీసు కంట్రోల్ రూం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, సీ-విజిల్ విభాగాల్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.

News April 14, 2024

జిల్లాలో అక్రమ మద్యం ఛాయలు కూడా ఉండరాదు: అనంత ఎస్పీ

image

జిల్లాలో అక్రమ మద్యం ఛాయలు కూడా ఉండకుండా గట్టి నిఘా వేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అమిత్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సెబ్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జిల్లాలో సెబ్ విభాగం అధికారులు, బృందాలు జరిపిన దాడులు, నమోదైన కేసులు, నిందితుల అరెస్టులు, బైండోవర్లు, NDPL & DPL సీజర్స్, నాటుసారా స్వాధీనంపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

News April 14, 2024

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

image

ఓటు హక్కును నమోదు చేసుకోనివారు నమోదుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శనివారం పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుందన్నారు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవాలని సూచించారు.

News April 14, 2024

ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళ నూతన సంవత్సర వేడుకలు..

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరంలో శనివారం సాయంత్రం తమిళనాడు, కేరళకు చెందిన సత్యసాయి భక్తులు సత్య సాయి బాబాపై భక్తి గేయాలను ఆలపించారు. రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.

News April 14, 2024

చిత్తూరు: స్ట్రాంగ్ రూముకు చేరిన ఈవీఎం పెట్టెలు

image

అంగళ్లు మిట్స్ కళాశాల స్ట్రాంగ్ రూంకు ఈవీఎం పెట్టెలు చేరినట్లు ఎస్సై మల్లికార్జున రెడ్డి తెలిపారు. సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈవీఎంలను భద్రపరిచిన పెట్టెలను శనివారం కురబలకోట మండలం, అంగళ్లు మిట్స్ కళాశాల స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర పార మిలిటరీ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశామని తెలిపారు.

News April 14, 2024

ప.గో.: సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం: ప్రభుత్వ విప్ 

image

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి పిరికిపందల చర్య అని, ఈ దాడిని ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమ కోసం చేపట్టిన బస్సు యాత్రలో ప్రతిపక్షాలు ఆయనపై దాడికి దిగడం శోచనీయమని అన్నారు.

News April 14, 2024

పోలింగ్ పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్

image

పోలింగ్ పటిష్ఠంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకుని సమర్థంగా విధులు నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాలూరు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు.

News April 14, 2024

విశాఖ: ‘హోం ఓటింగ్‌పై అవగాహన అవసరం’

image

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది హోం ఓటింగ్ పై అవగాహన కలిగి ఉండాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారులు సిబ్బందికి ఓటింగ్ విధానంపై నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు.