Andhra Pradesh

News April 14, 2024

విజయవాడ: జగన్‌పై క్యాట్‌బాల్‌‌తో రాళ్లదాడి

image

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.

News April 14, 2024

రాజమండ్రిలో గెలుపును మోడీకి గిఫ్టుగా ఇవ్వాలి: పురంధీశ్వరి

image

బీసీలంతా సమష్టిగా కృషిచేసి రాజమండ్రి పార్లమెంటులో బీజేపీని గెలిపించి మోడీకి గిఫ్టుగా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధీశ్వరి పిలుపునిచ్చారు. BJP ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరామ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు.

News April 13, 2024

అమ్మవారి సేవలో హర్యానా గవర్నర్

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏవిఎస్వో సతీష్ కుమార్, ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News April 13, 2024

సీఎం జగన్‌పై దాడి.. స్పందించిన MP భరత్

image

సీఎం జగన్‌పై రాయితో దాడి చేయడం పిరికిపందల చర్య అని, ఇది టీడీపీ వ్యూహమని ఎంపీ, రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద బస్సుపై నుంచి సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. పూలతోపాటు రాయిని దుండగులు విసరడంతో సీఎం ఎడమ కంటి కనుబొమ్మకు బలమైన గాయమైందన్నారు.

News April 13, 2024

విశాఖ: త్వరలో మెగా స్కూల్ క్రికెట్ లీగ్స్

image

ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లని వెలుగులోకి తీసుకువచ్చేందుకు  త్వరలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్ క్రికెట్ లీగ్స్ నిర్వహిస్తామని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర మాజీ క్రికెటర్స్ రీయూనియన్ వార్షికోత్సవం సందర్భంగా మాజీ క్రికెటర్స్ క్రికెట్ ఆడారు. అనంతరం ఆంధ్ర మాజీ క్రికెటర్స్ ఆధ్వర్యంలో గోపీనాథ్ రెడ్డిని సత్కరించారు.

News April 13, 2024

కొత్తవలస: ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ మృతి

image

కొత్తవలస ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం (33) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొత్తవలస కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఎనిమిది నెలల క్రితమే విధుల్లోకి వచ్చారు. అనారోగ్య కారణంగా రెండు రోజులుగా విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మార్వో సిబ్బంది అతని కుటుంబానికి సంతాపం తెలిపారు.

News April 13, 2024

GNT: వైసీపీలో చేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు

image

గుంటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉస్మాన్ కాంగ్రెస్‌ను, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చందు సాంబశివరావు బీజేపీని వీడారు. వీరు సీఎం జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఉస్మాన్‌, సాంబశివరావులను వైసీపీలోకి ఆహ్వానించారు.

News April 13, 2024

జాతీయ స్థాయి క్యారమ్స్ న్యాయ నిర్ణేతగా నాగేంద్ర

image

ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెలలో వారణాసిలో జరిగిన జాతీయస్థాయి క్యారమ్స్ న్యాయం నిర్ణేతలు పరీక్షలో కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర హాజరై పరీక్షల ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా సంఘం కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయి న్యాయం నిర్ణేతగా అర్హత సాధించిన రెండో జిల్లా వాసిగా గర్వకారణం ఉందన్నారు.

News April 13, 2024

విజయవాడ: జగన్‌పై క్యాట్‌బాల్‌‌తో రాళ్లదాడి

image

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.

News April 13, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

*24న టెక్కలిలో సీఎం జగన్ బస్సుయాత్ర ముగింపు
*శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
* 22న అచ్చెన్నాయుడు నామినేషన్
*శ్రీకాకుళం: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
* నందిగం రహదారిపై కారు బోల్తా
*చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు: ధర్మాన
*దిల్లీలో పాలకొండ సైనికుడు మృతి
*కొత్తూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి లభ్యం
*15న పలాసకు చంద్రబాబు రాక
* రాజాంలో రూ.20 లక్షల నగలు స్వాధీనం
* నరసన్నపేటలో వాలంటీర్ల రాజీనామా