Andhra Pradesh

News April 13, 2024

మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ పూర్తి: కలెక్టర్

image

ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వైబ్ సెట్ లో పూర్తి అయిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ ఎం ఎస్ 2 వ నిర్దేశిత వెబ్ సైట్ లో మొదటి విడత ఈవీఎం రాండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి అయిందని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 13, 2024

చిత్తూరు: మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్టు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివి ప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రక్రియపై రాజకీయ పార్టీలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.

News April 13, 2024

కడప: ప్రతిష్టాత్మకంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభ‌వంగా నిర్వహించేందుకు ప‌గ‌డ్భంది ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్ర‌వారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు.

News April 13, 2024

ఒంగోలు: అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్కులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్ధులకు అవసరమైన సూచనలు సలహాలను ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభవుతుందని, ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

News April 13, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఓర్వకల్లు మండలంలోని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన పాలకొలను గ్రామాన్ని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన నన్నూరు గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.

News April 13, 2024

విజయవాడలో సీఎం జగన్ యాత్ర రూట్ మ్యాప్ ఇదే..

image

విజయవాడలో సీఎం జగన్ శనివారం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ప్రతినిధులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. శనివారం సాయంత్రం 4.30 తాడేపల్లి నుంచి బయలుదేరి కనకదుర్గ వారధి మీదుగా బందర్ రోడ్డు, చుట్టుగుంట, సంగీత కళాశాల, బుడమేరు వంతెన, ప్రకాష్ నగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరులో బస్సు యాత్ర నిర్వహిస్తారన్నారు. అనంతరం రాత్రి 7:30కు కేసరపల్లిలో బస చేస్తారు.

News April 13, 2024

పాడేరు: ‘పునరావాస సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం కల్పించిన అన్ని పునరావాస సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, సమాజంలో ఉన్నత జీవనం సాగించాలని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆకాంక్షించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో 86 మంది మాజీ మావోయిస్టులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరిగి మావోయిస్టు పార్టీలో చేరడం కానీ, ఆ పార్టీకి సహాయ సహకారాలు అందించడం కానీ చేయమని మాజీ మావోయిస్టులు ప్రతిజ్ఞ చేశారు.

News April 13, 2024

మన్యం: ‘ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి’

image

సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోని సమర్ధంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్వతీపురం నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం సందర్శించారు.

News April 13, 2024

తాగునీటి చెరువులను 100% నింపాలి: గుంటూరు కలెక్టర్

image

తాగునీటి చెరువులను నాగర్జున సాగర్ కుడి కాలువ, కృష్ణ వెస్ట్రన్ డెల్టా కాలువకు విడుదల చేసిన నీటి ద్వారా 100% నింపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో తాగునీటి సరఫరాపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటే ముందుగానే తెలియజేయాలన్నారు.

News April 12, 2024

ఓటు వేయడం మీ హక్కే కాదు, మీ బాధ్యత కూడా: కలెక్టర్

image

జిల్లా ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుందని, ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదని, మీ బాధ్యత కూడా అని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘నేను తప్పక ఓటు వేస్తాను’ అనే స్లోగన్‌తో పాటు మోడల్ ఈవిఎమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.