Andhra Pradesh

News August 24, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ భేటీ

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పొదలకూరు రోడ్డులోని YCP జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, భవిష్య కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలు, జిల్లా నాయకత్వం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుమారు అరగంట పాటు మాట్లాడుకున్నారు.

News August 24, 2025

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గీతా మాధురి

image

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలుకు చెందిన గీతా మాధురిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గీతా మాధురి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గతంలో మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

News August 24, 2025

కడప: కానిస్టేబుల్ అభ్యర్థుల ట్రైనింగ్‌కు ఏర్పాట్లు

image

ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారు. కడప జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారు. ఎస్పీ అశోక్ కుమార్ ఈ సెంటర్‌ను ఆదివారం తనిఖీ చేశారు. వసతి, తరగతి గదులు, మైదానం, అంతర్గత దారులు, పరికరాలను పరిశీలించారు. డీఎస్పీ అబ్దుల్ కరీంకు పలు సూచనలు చేశారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP తెలిపారు.

News August 24, 2025

మచిలీపట్నంలో సైకిలింగ్ చేసిన ఎస్పీ

image

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు స్వయంగా సైకిలింగ్‌లో పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కోనేరుసెంటర్ వరకు జరిగిన సైకిలింగ్‌లో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, వందలాది మంది పోలీసులు పాల్గొన్నారు.

News August 24, 2025

నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

image

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.

News August 24, 2025

కర్నూలు: కవల పిల్లలకు టీచర్ ఉద్యోగాలు

image

గూడూరుకు చెందిన వడ్ల రామాంజనేయులు, సరస్వతి దంపతుల కుమారులు(కవలలు) రవితేజ ఆచారి, విష్ణు వర్ధన ఆచారి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలు పొందారు. రవితేజ ఆచారి 83 మార్కులు, విష్ణు వర్ధన ఆచారి 82 మార్కులు సాధించారు. తమ కుమారులు ఎస్జీటీ విభాగంలో ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు వారిని అభినందించారు.

News August 24, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ఈ నెల 25న కలెక్టరేట్లో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలు నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

News August 24, 2025

జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై సమీక్ష

image

జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు హాజరుకానుండటంతో రవాణా, వసతి, పార్కింగ్, భద్రత, తదితర సదుపాయాలపై అధికారులు, నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కమిషనర్ పాల్గొన్నారు

News August 24, 2025

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

image

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతుండటంతో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుందని నాయకులు భావిస్తున్నారు.

News August 24, 2025

కాశినాయన: భార్యాభర్తకు టీచర్ జాబ్

image

కాశినాయన మండలం ఉప్పలూరుకు చెందిన పాలకొలను సుబ్బారెడ్డి, సుమలత దంపతులు DSCలో సత్తా చాటారు. సుబ్బారెడ్డి PSలో 3వ ర్యాంకు సాధించారు. ఆయన సతీమణి సుమలత సైతం PSలోనే 13వ ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సుబ్బారెడ్డి ప్రస్తుతం కడపలోని ఓ కాలేజీలో, సుమలత ఖాజీపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నారు.