Andhra Pradesh

News April 12, 2024

18న నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి ప్రకటన

image

దర్శి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బూచేపల్లి కుటుంబం రుణపడి ఉంటామన్నారు. తనను ఆశీర్వదించేందుకు మహిళలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.

News April 12, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 12,000 మంది ఉద్యోగులకు పోస్టర్ బ్యాలెట్ సౌకర్యం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల విధులకు కేటాయించిన 12,000 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ లక్ష్యంతో సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలు.. కర్నూలు జిల్లాలో బాలికలదే హవా..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలలో కర్నూలు జిల్లాలో మరోసారి బాలికల హవా కొనసాగింది. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 10,037 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 7,406 మంది ఉత్తీర్ణత సాధించి 74 శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ ఫలితాలలో 8,826 విద్యార్థినులు పరీక్ష రాయగా.. 7,147 మంది ఉత్తీర్ణత సాధించి 81 శాతంతో మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విభాగంలో 70%, సెకండ్ ఇయర్‌లో 74 శాతంతో నిలిచారు.

News April 12, 2024

ప.గో.: ALERT: 14వ తేదీన వడగాలులు.. జాగ్రత్త

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 14న పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప.గో. జిల్లాలో 2 మండలాల్లో, ఏలూరు జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News April 12, 2024

ALERT: రెండు రోజులు వడగాలులు.. జాగ్రత్త

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News April 12, 2024

నిర్భయంగా ఓటు వేయండి.. ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: ఎస్పీ

image

ఎన్నికల వేళ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ అమిత్ బర్దర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరులో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో ఎస్పీ పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 12, 2024

ఈవీఎంలను పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లా కేంద్రంలోని టెక్కే మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.

News April 12, 2024

భీమిలి: సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ‘గంటా’

image

నియోజకవర్గం మారడంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. రాజకీయాల్లో పార్టీ అధిష్ఠీన వర్గం చెప్పినట్లు నడుచుకోవాలనే కనీస పరిజ్ఞానం సుబ్బారెడ్డికి లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలను స్థానాలు మార్చి పోటీ చేయిస్తున్నారో ఆయనకు తెలియదా అన్నారు. YCP నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే డిపాజిట్లు రాకుండా ఓడిపోతారని కౌంటర్ ఇచ్చారు.

News April 12, 2024

బెంగళూరు-ఖరగ్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎంవి బెంగళూరు ఖరగ్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డీసీఎం త్రిపాఠి తెలిపారు. ఈనెల 12 నుంచి 17 వరకు నడిచే ఈ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా ఖరగ్ పూర్ చేరుకుంటుందన్నారు. ఈనెల 15 నుంచి 20 వరకు నడిచే ఖరగ్ పూర్-ఎస్ఎంవి బెంగళూరు ప్రత్యేక రైలు సాయంత్రం నాలుగు గంటలకు ఖరగ్ పూర్‌లో బయలుదేరుతుందన్నారు.

News April 12, 2024

నరసరావుపేట: ఇంటర్ ఫెయిల్ కావడంతో ఆత్మహత్య

image

నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని మనస్తాపం చెంది ఉరేసుకుంది. మృతురాలు ఇంటర్ సెకండియర్ చదువుతున్న అర్చనగా గుర్తించారు.