Andhra Pradesh

News April 12, 2024

ఇంటర్ ఫలితాలలో మన గుంటూరు రెండో స్థానం

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 87 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. 26,007 మంది పరీక్షలు రాయగా 22,673 మంది పాసయ్యారు. పల్నాడు జిల్లా 73 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. 12,087 మంది పరీక్షలు రాయగా 8,870 మంది పాసయ్యారు. బాపట్ల జిల్లా 71 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 7995 మంది పరీక్షలు రాయగా 5709 మంది పాసయ్యారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలు: నాలుగో స్థానంలో విశాఖ

image

➠ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విశాఖ జిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 84 శాతంతో 4వ స్థానంలో ఉంది.
➠ కాకినాడ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 52 శాతంతో 24వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 66శాతంతో 25వ స్థానంలో నిలిచింది.
➠ అల్లూరి సీతారామరాజు జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 48 శాతంతో 26 స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 70 శాతంతో 20వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో అనంత, సత్యసాయి జిల్లా స్థానాలు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అనంత జిల్లా 60% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో, సత్యసాయి 58% ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలిచింది. అనంతలో 21826 మందికి 13115 మంది.. సత్యసాయిలో 9878 మందికి 5769 మంది పాసయ్యారు. సెకండియర్లో అనంత జిల్లా 78% ఉత్తీర్ణతతో 10వ స్థానం, సత్యసాయి జిల్లా 76 % ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. అనంతలో 15653 మందికి 12210 మంది, సత్యసాయిలో 7447 మందికి 5653 మంది పాసయ్యారు.

News April 12, 2024

కడప: ఇంటర్‌లో ఎంతమంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కడప జిల్లాలో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,470 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 7,954 మంది పాస్ అయ్యారు. 55 శాతం ఉత్తీర్ణతతో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 12,131 మందికి గాను, 8,375 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 69 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొదటి సంవత్సరం కంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కడప జిల్లా విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చాయి.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలు.. 9వ స్థానంలో పశ్చిమ గోదావరి

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 69 శాతం(ఉత్తీర్ణత)తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 80 శాతంతో 9వ స్థానంలో ఉంది.
➠ ఏలూరు జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 72 శాతంతో 6వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 80 శాతం (ఉత్తీర్ణత)తో 8వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ ఫలితాల్లో తూ.గో 5వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 75 శాతం(ఉత్తీర్ణత)తో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో 83 శాతంతో 5వ స్థానంలో ఉంది.
➠ కాకినాడ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 60 శాతంతో 15వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 71 శాతంతో 18వ స్థానంలో నిలిచింది.
➠ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 60 శాతంతో 17వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 72 శాతంతో 16వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 1,5688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లోనూ 84 శాతంతో కృష్ణా తొలిస్థానంలో నిలిచింది. 20,324 మందికి 17,070 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 79 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 38,307 మందికి 30353 మంది పాసయ్యారు.

News April 12, 2024

చిత్తూరు జిల్లాలోనే లాస్ట్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 63 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే చివరి(25) స్థానంలో నిలిచింది. 10,882 మంది పరీక్షలు రాయగా 6,817 మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990 మంది పరీక్షలు రాయగా 21,062 మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 69 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 10,384 మంది పరీక్షలు రాయగా 7,153 మంది పాసయ్యారు.

News April 12, 2024

అనంతలో చీనీ టన్ను ధర రూ.38 వేలు

image

అనంత వ్యవసాయ మార్కెట్ యార్డు సంతలో చీనీ కాయల ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 7న టన్ను రూ.35 వేలు ఉండగా 8న రూ.38 వేలకు పలికింది. ఈనెల 9న రూ.36 వేలు, 10న రూ.37 వేలు, 11న రూ.38 వేలు ధర పలికింది. మూడ్రోజులుగా టన్ను రూ.1000 చొప్పున ధర పెరుగుతూనే ఉంది. విక్రయాలు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. గురువారం కాస్తా విక్రయాలు పెరిగాయి. మొత్తం 219 టన్నులు వచ్చాయి.

News April 12, 2024

గుడివాడలో ఈనెల 14న మేము సిద్దం సభ

image

గుడివాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఏలూరు రోడ్ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి సమీపంగా సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. గత రెండు రోజులుగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 14వ తేదీన జగన్ గుడివాడలో సిద్ధం సభకు రానున్న నేపథ్యంలో కృష్ణాజిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల ప్రజలు హాజరుకానున్నారు.