Andhra Pradesh

News April 12, 2024

నెల్లూరు: రూ.5.28 లక్షల మద్యం సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు రూ.5,28,168 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశామన్నారు. పొరుగు మద్యం విక్రయాలపై 3 కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనధికార విక్రయాలపై 191 కేసులు నమోదు చేసి 194 మందిని అరెస్ట్ చేశారు.

News April 12, 2024

పుంగనూరులో TDPదే రికార్డ్..!

image

ఇప్పుడు పుంగనూరు అంటేనే అందరికీ మంత్రి పెద్దిరెడ్డి, YCP గుర్తుకు వస్తుంది. కానీ పుంగనూరులో అసలు రికార్డు TDPదే. 1983 నుంచి 1996 వరకు ఆ పార్టీనే వరుసగా ఐదుసార్లు గెలిచింది. 1985 నుంచి 1994 వరకు ఎన్.రామకృష్ణా రెడ్డి(మాజీ అమర్నాథ్ రెడ్డి తండ్రి) మూడుసార్లు విజయం సాధించారు. 1996 ఉప ఎన్నికలు, 2004లో అమర్నాథ్ రెడ్డి MLAగా ఎన్నికయ్యారు. 2009, 14, 19లో ఇక్కడ గెలిచిన పెద్దిరెడ్డి ఈసారి కూడా బరిలో ఉన్నారు.

News April 12, 2024

రోడ్డు ప్రమాదంలో దంపతులు స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కొత్త పల్లె సమీపంలో గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలకు చెందిన గంగావరపు రాజగోపాల్ రెడ్డి కుటుంబంతో గుంటూరులో ఉంటున్నాడు. బ్యాంక్ పనుల నిమిత్తం నంద్యాలకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు గుంటూరు-కర్నూల్ జాతీయ రహదారిపై చెట్టును ఢీకొంది. ప్రమాదంలో రాజగోపాల రెడ్డి, లక్మీ దేవి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 12, 2024

తూ.గో: తీవ్ర ఉత్కంఠ.. మరో గంటే..!

image

ఉమ్మడి తూ.గో ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 25,256 మంది, తూ.గో-41,382 మంది, కాకినాడ జిల్లాలో 44,179 మంది ఫస్ట్, సెంకడ్ ఇయర్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాశారు. గతేడాది ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి తూ.గో జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 6వ, సెకండ్ ఇయర్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి కొత్త జిల్లాల వారీగా ఫలితాలు వెలువడనుండగా.. ఏ జిల్లా ఏ స్థానంలో నిలువనుందో..?

News April 12, 2024

సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్

image

పిడుగురాళ్లలో సీఎం సిద్ధం సభ తర్వాత పల్నాడు రాజకీయాలు వేడెక్కాయి. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సభలో కాసు ప్రసంగిస్తూ తమ దగ్గర డబ్బుల్లేవు కానీ దమ్ముందన్నారు. దానికి యరపతినేని స్పందిస్తూ ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. దానికి కాసు తాను సిద్ధమేనంటూ ప్రతి సవాల్ విసిరారు.

News April 12, 2024

నెల్లూరు జిల్లాలో కోవర్టు రాజకీయాలు..!

image

నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో జిల్లాలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ పెరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా జరుగుతున్నాయి. కొందరు కోవర్టులుగా పని చేస్తూ సొంత పార్టీకి నష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి వెంట తమ కోవర్టులు ఉన్నారని వైసీపీ కోవూరు MLA అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడే స్వయంగా చెప్పడం ఇందుకు నిదర్శనం.

News April 12, 2024

పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైనట్లు బుక్కరాయ సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. అదే విధంగా సీకే పల్లి 41, గుంతకల్ 40.9, తలుపుల 40.8, కదిరి 40.6, యల్లనూరు 40.5, ధర్మవరం, పరిగిలో 40.4, శెట్టూరు 40.3,యాడికి 40.2,కుడేరు, సింగణమలలో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

News April 12, 2024

ముసునూరు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

రక్షణ కోసం ముసునూరు పోలీసులను గురువారం రాత్రి నూతన దంపతులు ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన టి.రాధాకృష్ణ, పెదపాడు మండలం కేఆర్ పాలెం గ్రామానికి చెందిన ఎన్. నవ్య ఏలూరు పట్టణ కేంద్రంలో సోషల్ మ్యారేజ్ సంస్థ వారి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. మేజర్లమైన తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.

News April 12, 2024

మొదటిసారి ఓటమి రుచి చూపించనున్న భీమిలి..!

image

భీమిలి నుంచి పోటీపడుతున్న గంటా శ్రీనివాసరావు(TDP), అవంతి శ్రీనివాస్‌(YCP)కి ఇప్పటివరకు ఓటమి తెలీదు. ఈసారి మాత్రం ఒకరికి ఓటమి తప్పదు. గంటా ఇప్పటి వరకు అనకాపల్లి ఎంపీ, చోడవరం, భీమిలి, విశాఖ నార్త్, అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, అవంతి రెండు సార్లు భీమిలి ఎమ్మెల్యేగా ఒకసారి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. మరి మొదటిసారి ఓటమి రుచిని వీరిద్దరిలో భీమిలి ఎవరికి చూపిస్తుందో కామెంట్ చెయ్యండి.

News April 12, 2024

ప్రకాశం: నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల‌ భవితవ్యం

image

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని ఆర్ ఐవో సైమన్ విక్టర్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను 39,377మంది రాశారు. వీరిలో 19,233 మంది మొదటి సంవత్సరం, 18,128 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం కొన్ని నిమిషాలలో తేలనుంది. ఇప్పటికే విద్యార్థులు ఫలితాల కోసం నెట్ సెంటర్ల వద్దకు చేరారు.