Andhra Pradesh

News April 12, 2024

విశాఖ: ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు’

image

బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గురువారం సీపీఐ నగర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు ఓట్లు రాకపోయినా ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల, పార్టీ నేత పైడిరాజు పాల్గొన్నారు.

News April 12, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో పరీక్ష రాసిన 19,856 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన 19,856 మంది విద్యార్థులు పరీక్షలకు హాల్ టికెట్లు ఇచ్చారు. వీరిలో 19,791 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 17,268 మంది కాగా.. సప్లమెంటరీ రాసినవారు 2,588 మంది ఉన్నారు.

News April 12, 2024

ఈనెల 29న విశాఖ రానున్న ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్

image

విశాఖ నుంచి చెన్నై మీదుగా పోర్ట్ బ్లెయిర్‌కు సర్వీస్ నడిపేందుకు ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ సిద్ధం అవుతుంది. ఈనెల 29వ తేదీన ఈ షిప్ విశాఖ చేరుకుంటుంది. రేట్లు, బెర్తింగ్,  టైమ్స్ తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలో విశాఖ పోర్టుకు ది వరల్డ్ సంస్థ ప్రతినిధులు రానున్నారు. విశాఖ పోర్టు నుంచి 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇది బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి చెన్నై మీదుగా పోర్ట్ బ్లెయిర్‌కు వెళుతుంది.

News April 12, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రమేశ్‌రెడ్డి

image

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు అధిష్ఠానం ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా రమేశ్‌రెడ్డి రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News April 12, 2024

ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ బాలికల జట్ల ఎంపిక

image

ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 14న నిర్వహించనున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కె.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే బాలికల జట్టును ఏలూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో ఉదయం 9 గంటలకు, బాలుర జట్టును తాడేపల్లిగూడెం కడకట్ల మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఎంపిక చేస్తామన్నారు.

News April 12, 2024

NLR: ఫలితాల కోసం 52,076 మంది వెయిటింగ్

image

ఇంటర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆస్ఐఓ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 26,419 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 25,657 మంది హాజరయ్యారు. మొత్తంగా 52,076 మంది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.

News April 12, 2024

సింహాచలం: ఆ వాహనాలకు మాత్రమే అనుమతి

image

వచ్చే నెల 10న జరగనున్న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి అధికారిక ప్రొటోకాల్ పరిధిలోని వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. తొలిపావంచా నుంచి భక్తులను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో కొండపైకి తరలిస్తారు. నగర పరిధిలోని ఆరు ఏడు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రొటోకాల్ వుండదు.

News April 12, 2024

విజయనగరం జిల్లాలో పరీక్ష రాసిన 45,755 మంది

image

ఈరోజు 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో విజయనగరం జిల్లాకు చెందిన 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 45,755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 20,630 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు 25,125 మంది ఉన్నారు.

News April 12, 2024

కడప: ప్రియుడి కోసం భర్తను చంపింది

image

ఎర్రగుంట్లకు చెందిన రాంబాబు, మాధవి భార్యాభర్తలు. భరత్ అనే వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త మందలించడంతో తల్లి, ప్రియుడితో కలిసి అడ్డు తొలగించాలనుకున్నారు. తొలుత రాంబాబు పేరుతో రూ.20 లక్షలకు బీమా చేయించారు. ఈ నెల 2న రాంబాబును టవల్‌తో గొంతు బిగించి హత్య చేసి, సైలెంట్ అయ్యారు. దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి రాగా, గురువారం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు.

News April 12, 2024

ఈనెల 15న విజయనగరం జిల్లాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన తేదీలు ఖరారైనట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈనెల 15న రాజాంలో సాయంత్రం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు విజయనరగంలో సాయంత్రం 4 గంటలకు, నెల్లిమర్ల ప్రధాన కూడలిలిలో రాత్రి 7 గంటలకు జరిగే సభల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు వెల్లడించారు. కాగా.. అభ్యర్థుల ప్రకటన అనంతరం మొదటిసారి వీరు జిల్లాకు వస్తున్నారు.