Andhra Pradesh

News August 24, 2025

గుంటూరులో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నిధులు

image

గుంటూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడానికి నిధులు మంజూరు చేయిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మానస సరోవరం, ఉండవల్లి గుహలు వంటి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. సూర్యఘర్ పథకం కింద నమోదైన లక్ష మందిలో కేవలం 3,600 మందికే పరికరాలు అమర్చారని, ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.

News August 24, 2025

మూడు జిల్లాల్లోని ఏకైక పోస్టుకు వేణు మాధురి ఎంపిక

image

డీఎస్సీ-2025 పరీక్షలో తాడేపల్లిగూడెం చెందిన వేణు మాధురి మూడు జిల్లాల్లో ఉన్న ఏకైక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు ఎంపిక కావడం విశేషం. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్‌కు ఎంపిక కావడంతో పాటు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 11వ ర్యాంకు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు 17వ ర్యాంకు సాధించారు. అంతేకాకుండా తల్లిదండ్రులు, సోదరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం విశేషం.

News August 24, 2025

గుత్తిలో భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

గుత్తిలో ఆదివారం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కేజీ రూ.160 ఉండగా. మటన్ రూ.700 నుంచి రూ.750 వరకు ఉందని షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. అనంతపురంలో కేజీ చికెన్ రూ.140 ఉండగా, గుంతకల్లులో రూ.150గా ఉంది. గుత్తిలో రెండు రోజుల క్రితం కేజీ చికెన్ రూ.170 పలికింది. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

News August 24, 2025

VZM: తెంగాణలో స్టేట్ టాపర్.. ఏపీలో 5 ఉద్యోగాలు

image

DSC ఫలితాల్లో విజయనగరానికి చెందిన కే.వి.ఎన్ శ్రీరాం 5 ఉద్యోగాలు సాధించాడు. SA గణితంలో 7వ ర్యాంక్, ఫిజిక్స్ 10th, జోన్ స్థాయి పోస్టులో PGT మ్యాథ్స్ 5th, TGT మ్యాథ్స్ 18th, జనరల్ సైన్స్‌లో 7వ ర్యాంక్ వచ్చింది. కాగా తెలంగాణ DSC పోటీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ మాథ్స్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంక్ సాధించి ఖమ్మం జిల్లాలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

News August 24, 2025

విశాఖలో ఉదయాన్నే యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలో ఆదివారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గంట్యాడ నుంచి గంగవరానికి వెళ్లే దారిలో కొంగపాలెం జంక్షన్ వద్ద నడిచి వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న న్యూ పోర్టు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 24, 2025

కర్నూలు: ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు

image

కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్ 84.11 మార్కులతో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని పిల్లలు పేర్కొన్నారు.

News August 24, 2025

కడప: భార్యాభర్తకు టీచర్ ఉద్యోగాలు

image

DSCలో కడప జిల్లా కాశినాయన మండలం రెడ్డికొట్టాలకు చెందిన దంపతులు సత్తాచాటారు. అంబవరం శేఖర్ 10వ ర్యాంకుతో ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన భార్య తేజస్వి SGTలో 317వ ర్యాంకు సాధించారు. శేఖర్ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గ్యారంపల్లి APRJCలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఒకేసారి భార్యాభర్తకు ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం అంబారన్ని అంటింది.

News August 24, 2025

చిత్తూరులో నేటి చికెన్ ధరలు…

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.105, మాంసం రూ.152 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.173 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున పలు దుకాణాల్లో అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 24, 2025

కృత్తివెన్ను: ఇద్దరి యువకులపై పోక్సో కేసు

image

కృత్తివెన్ను మండలంలో మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతనికి సహకరించిన మరొక యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించినామని చెప్పారు. 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News August 24, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

రాజమండ్రిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.