Andhra Pradesh

News April 10, 2024

విజయవాడ వెస్ట్‌లో రసవత్తర రాజకీయం

image

పోతిన మహేశ్ వైసీపీలో చేరికతో విజయవాడ వెస్ట్ రాజకీయం రసవత్తరంగా మారింది. జనసేనలో బీసీ నేతగా ఎదిగిన మహేశ్ ద్వారా ఆ వర్గ ఓటర్లను వైసీపీ వైపు మళ్లించేలా అధిష్ఠానం వ్యూహాలకు సిద్ధమైంది. మరోవైపు, కూటమి నుంచి బరిలో దిగిన సుజనా చౌదరి కచ్చితంగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. మహేశ్ పార్టీ మార్పుతో ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News April 10, 2024

పెందుర్తిలో ఎవరు గెలిచినా రికార్డే..!

image

పెందుర్తి నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అప్పటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరగగా.. 11 సార్లు వేర్వేరు అభ్యర్థులే గెలిచారు. ఈ సారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీలో ఉండగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్ల రమేశ్ బరిలో ఉన్నారు. అయితే పంచకర్ల 2009లో పీఆర్పీ నుంచి గెలిచారు. దీంతో వీరిలో ఎవరు గెలిచినా పెందుర్తిలో రెండోసారి గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.

News April 10, 2024

రెండింటిలోనూ చింతా మోహన్ హ్యాట్రిక్

image

కాంగ్రెస్ తిరుపతి MP అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గెలుపు, ఓటమిలో హ్యాట్రిక్ కొట్టారు. ఆయన 1984లో టీడీపీ అభ్యర్థిగా, 1989, 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1996లో పోటీ చేయలేదు. 1999లో ఓడిపోయారు. 2004, 2009లో గెలిచారు. 2014, 2019, 2021లో హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్నారు. 2021 ఉప ఎన్నికల్లో 9585 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 11వ సారి పోటీ చేస్తున్నారు.

News April 10, 2024

మాచర్ల నుంచి గుంటూరు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ

image

మాచర్ల నుంచి గుంటూరు వరకు, గుంటూరు నుంచి మాచర్ల వరకు నడిచే రైలును తిరిగి ప్రారంభిస్తున్నట్లు గుంటూరు రైల్వే డిఆర్‌ఎం రామకృష్ణ బుధవారం తెలిపారు. 20 రోజులుగా ఈ రైలు నిలిచిపోవడంతో ఉద్యోగస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే జేఆర్‌యు సిసి మెంబర్ మద్దాల సుబ్బయ్య, గుంటూరు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు నేటినుంచి ప్రారంభిస్తామన్నారు.

News April 10, 2024

VZM: ‘ఇంటింటి ప్ర‌చారంపై ముందుగా స‌మాచారం ఇవ్వాలి’

image

ఇంటింటి ఎన్నిక‌ల‌ ప్ర‌చారం, పాంప్లెట్ల పంపిణీ గురించి ముందుగా సంబంధిత పోలీసు స్టేష‌న్‌లో స‌మాచారం ఇస్తే స‌రిపోతుంద‌ని, ప్ర‌త్యేకంగా వీటికోసం అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి స్ప‌ష్టం చేశారు. త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి తాజాగా వ‌చ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వివ‌రించారు.

News April 10, 2024

ఎన్టీఆర్: జిల్లాలో ఈనెల 13న నిజం గెలవాలి ముగింపు సభ

image

చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ముగింపు సభను ఈ నెల 13న ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా గత 6 నెలలుగా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి వారికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ మేరకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నేత కేశినేని చిన్ని చెప్పారు.

News April 10, 2024

చిత్తూరు: ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్

image

జిల్లాలో ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని చిత్తూరు కలెక్టర్ ఎస్.షన్మోహన్ వెల్లడించారు. తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎస్పీ మణికంఠ, డీఆర్వో పుల్లయ్యతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులకు హాజరవుతున్న 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కల్పించామన్నారు.

News April 10, 2024

విశాఖ: మిల్లెట్స్‌తో రూపొందించిన మక్కా మసీదు

image

రంజాన్ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో కళాకారుడు మొకా విజయ్ కుమార్ మిల్లెట్స్‌తో, మక్కా మసీదును రూపొందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఎన్నో పోషక విలువలు కలిగిన మిల్లెట్స్‌తో తయారుచేసిన పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతోందన్నారు. మిల్లెట్స్‌పై అవగాహన కల్పించడానికి దీనిని రూపొందించడం జరిగిందన్నారు.

News April 10, 2024

30 నెలల్లో నెల్లూరు ఎయిర్‌పోర్ట్ కడతాం: VSR

image

నెల్లూరు జిల్లా ఎయిర్‌పోర్ట్ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి(VSR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు దగాకోరు హామీల్లో నెల్లూరు ఎయిర్ పోర్టు ఒకటి. 2018లో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేస్తామని నమ్మబలికారు. నేను ప్రామిస్ చేస్తున్నా. జగన్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎయిర్‌పోర్టు పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News April 10, 2024

ఆ సిబ్బందిని వెంటనే బదిలీ చేయండి: భూమిరెడ్డి

image

జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోం గార్డులును వేరే జిల్లాలకు బదిలీ చేయాలని శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈసీని కోరారు. సీఎం జగన్.. ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పదవులు ఇచ్చారని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. వారు ఎన్నికల పమయంలో అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి లేఖ రాశారు.