Andhra Pradesh

News April 10, 2024

TDP తీర్థం పుచ్చుకున్న ఇక్బాల్

image

ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మహ్మద్ ఇక్బాల్ TDP తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవాళ ఆయన TDPలో చేరారు. ఇక్బాల్ కు పసుపు కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అనంతపురం (D) హిందూపురం MLA టికెట్ ను CM జగన్ దీపికకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన YCPకి గుడ్ బై చెప్పారు.

News April 10, 2024

విజయవాడ: వైఎస్సార్ హెల్త్ విశ్వవిద్యాలయంలో క్రీడా పోటీలు

image

విజయవాడ: వైఎస్సార్ హెల్త్ విశ్వవిద్యాలయంలో 24వ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ ఈ త్రిమూర్తి రాజు బుధవారం తెలిపారు. ఈ పోటీలు ఏప్రిల్ 13వ తేదీ నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. ఈ పోటీలలో 25 మెడికల్, డెంటల్ కళాశాలల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

News April 10, 2024

హింసకు తావు లేకుండా ఎన్నికల జరగాలి:కలెక్టర్

image

హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా ఎన్నికలు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలాని సమూన్ అన్నారు. బుధవారం ఎచ్చెర్ల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తెలిపారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.

News April 10, 2024

దర్శి వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన గొట్టిపాటి లక్ష్మి

image

దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను దర్శి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆహ్వానం మేరకు గొట్టిపాటి లక్ష్మి కలిసినట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేను గొట్టిపాటి లక్ష్మి కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News April 10, 2024

12న ఈవీఎంల రాండమైజేషన్: కలెక్టర్

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సిబ్బందితో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాండమైజేషన్ ప్రక్రియపై ఆయన వారికి అవగాహన కల్పించారు.

News April 10, 2024

శ్రీకాకుళం: ట్రాఫిక్ సిబ్బందికి కిట్స్ అందజేత

image

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాప్స్, కళ్ళద్దాలు, వాటర్ బాటిల్స్‌లను ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జీ.ఆర్ రాధిక చేతుల మీదగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే వస్తు సామగ్రి ఓ ప్రైవేటు సంస్థ ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు.

News April 10, 2024

గుంటూరు: భార్య గొంతు కోసి పరారైన భర్త

image

పెదకాకానిలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంగళరావు నగర్‌లో నివాసముంటున్న సయ్యద్‌ షామీర్‌ మూడేళ్ళ క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సయ్యద్‌ తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 10, 2024

నందిగాం: 360 మంది వాలంటీర్లు రాజీనామా

image

నందిగాం మండలంలో 20 సచివాలయాలకు సుమారు 16 సచివాలయాల పరిధిలోని 360 మంది వాలంటీర్లు బుధవారం ఉదయం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలతో మానసిక వేదనకు గురై రాజీనామా చేశామని వారు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటుగా నియోజకవర్గ వైసీపీ నాయకులు ఉన్నారు.

News April 10, 2024

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ మనజీర్ జిలాని సమూన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తహాశీల్దార్ కార్యాలయంతో పాటుగా గొబ్బూరు గ్రామ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఓటింగ్‌ శాతం పెరిగే విధంగా ఓటర్లను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలన్నారు.

News April 10, 2024

కడప: ‘జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం’

image

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోని విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డిలు తెలిపారు. కడపలో వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేనివిధంగా, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో నాడు నేడు మనబడి కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారన్నారు. ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు.