Andhra Pradesh

News April 10, 2024

రాజంపేట: ‘ఇప్పటికైనా గుర్తించి, సీటు ఇస్తే గెలుచుకొస్తా’

image

టీడీపీ అధిష్ఠానం ఇప్పటికైనా గుర్తించి, తనకు టీడీపీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట రాంనగర్‌లో బుధవారం తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల ప్రచారం ప్రారంభించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి ఈరోజు ప్రచారం ప్రారంభించగా, అదే సమయానికి బత్యాల మరో చోటు నుంచి ప్రచారం ప్రారంభించడం అందరినీ అయోమయ పర్చింది.

News April 10, 2024

ఉండి టీడీపీ శ్రేణుల వరుస రాజీనామాలు

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు టిక్కెట్ మారుస్తున్నారు అంటూ వస్తున్న ప్రచారానికి రామరాజు అభిమానులు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లుగా కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ రాజీనామాలు నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News April 10, 2024

నెల్లూరు: 20 రోజుల్లో 981 మంది వాలంటీర్లు రాజీనామా

image

నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 20 రోజుల్లో దాదాపు 981 మంది రాజీనామా చేయగా… ఇంకా వందల సంఖ్యలో రాజీనామాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13 వేల మంది వాలంటీర్లు ఉండగా.. వారిలో దాదాపు పదిశాతం మంది రాజీనామాలు చేశారు. కావలి, కోవూరు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

News April 10, 2024

కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం: ఉమ్మి యూసుఫ్

image

ఆదోని ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే ఆదోని నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటాన‌ని ఉమ్మి యూసుఫ్ తెలిపారు. ఆయన ఇటీవ‌లే ఎంఐఎం నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆదోనిలోని ఆయ‌న నివాసంలో మంగళవారం విలేక‌రుల‌తో మాట్లాడారు. అధిష్ఠానం టికెట్ ఇత‌రుల‌కు ఇచ్చినా వారితో క‌లిసి ప‌ని చేస్తాన‌న్నారు. అభివృద్ధి జ‌ర‌గాలంటే ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌న్నారు.

News April 10, 2024

అమలాపురం MLA అభ్యర్థి ప్రకటన

image

రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ నుంచి పాలమూరి మోహన్ పోటీ చేస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి తెలిపారు. ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామానికి చెందిన మోహన్ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్నారు. పార్టీ ఆశయాల పట్ల ఆకర్షితులై ఇటీవల బీఎస్పీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గంలో మోహన్‌ను గెలిపించాలని కోరారు.

News April 10, 2024

కురిచేడు: విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

image

కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలెంలో విద్యుత్‌షాక్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన పల్లె పాపయ్య(49) ఇంట్లో ఫ్యాన్‌ తిరగకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News April 10, 2024

అనంత: ఆశాజనకంగా చీనీ ధర

image

ఉగాది సందర్భంగా అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. మార్కెట్‌కు మంగళవారం 355 టన్నులు మాత్రమే రైతులు తీసుకొచ్చారు. పంట తక్కువ వచ్చినా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పండగ కారణంగా సరకు రావడం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డు సంతలో టన్ను గరిష్ఠ ధర రూ.36 వేలు, మధ్యస్థ ధర రూ.21 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలుగా ఉంది.

News April 10, 2024

నెల్లూరు కలెక్టర్‌కే ఎంపీ టికెట్

image

ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్‌గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్‌కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.

News April 10, 2024

వల్లభనేని వంశీ ముంగిట అరుదైన రికార్డు

image

గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి 2014, 19 ఎన్నికల్లో గెలిచిన వంశీ వల్లభనేని తాజాగా వైసీపీ తరఫున బరిలోకి దిగనున్నారు. గన్నవరంలో 1955 నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలు ఎవరూ సాధించలేదు. 2024 ఎన్నికలలో వంశీ గెలిస్తే గన్నవరం గడ్డపై హ్యాట్రిక్ కొట్టిన మొదటి నాయకుడవుతారు. టీడీపీ నుంచి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటారో కామెంట్ చేయండి.

News April 10, 2024

తూ.గో: 2 నెలలు బంద్..కారణం ఇదే..!

image

తూ.గో జిల్లాలో ఈనెల 15 నుంచి జూన్ 16 వరకు అన్ని రకాల చేపల వేటలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడమే ఉద్దేశమన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి చేపల వేటకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.