Andhra Pradesh

News April 10, 2024

నెల్లూరు: ‘డేరింగ్ అండ్ డాషింగ్’ మూవీ టీం పూజలు

image

నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ మూవీ టీమ్ తమ చిత్రం విజయవంతంగా పూర్తయి విజయం సాధించాలని పూజలు నిర్వహించారు. 25 కళాశాల అధ్యక్షులు, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా.. వైభవంగా జరిగాయి. హీరోగా శ్రీరామ్, హీరోయిన్ గా మిధున ప్రియ వ్యవహరిస్తుండగా కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు.

News April 10, 2024

విజయనగరం: అత్తారింటికి వెళ్తూ మృతి

image

పండగ పూట అత్తారింటికి వెళ్తూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బలిజిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంగాపురం గ్రామానికి చెందిన ఎస్.సంగమెశ్ (24) మంగళవారం మిర్తివలస అత్తవారింటికి వెళ్తుండగా బైక్‌ని, లారీ బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయలైన సంగమేశ్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

News April 10, 2024

చీరాల: ‘మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా’

image

ఇటీవలే పదో తరగతి పరీక్షలు అయిపోయిన విషయం విధితమే. తాజాగా మూల్యాంకనం నిర్వహించారు. చీరాలకు చెందిన ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. దీంతో విస్తుపోయిన టీచర్ దానిని పై అధికారులకు చూపించారు. అయితే ఈ విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం. మరో సబ్జెట్‌లో మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది. అని రాయడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.

News April 10, 2024

అవనిగడ్డ: 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

image

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డలోని ఓ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తీసుకొచ్చిన వృద్ధురాలు కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా, నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.

News April 10, 2024

పింఛన్ల పంపిణీలో నంద్యాలకు 3, కర్నూలు 6వ స్థానం

image

నంద్యాల: ఈనెల 3న ప్రారంభమైన పింఛన్ల పంపిణీ ముగిసింది. కర్నూలు జిల్లాలో 2,46,871 పింఛన్లకు గానూ 2,44,836 మందికి పంపిణీ చేశారు. వివిధ కారణాల వల్ల 2,035 మంది పింఛన్ తీసుకోలేదు. 99.18 శాతం పంపిణీతో రాష్ట్రంలో కర్నూలు జిల్లా 6వ స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లాలో 2,22,398 పింఛన్లు ఉండగా 2,21,228 మందికి పంపిణీ చేశారు. 99.23 శాతంతో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది.

News April 10, 2024

అన్నవరం నుంచి ప్రచారం ప్రారంభించిన గంటా

image

భీమిలి మండలం అన్నవరంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలో గల రామాలయంలో సతీసమేతంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని అన్నారు.

News April 10, 2024

బుడంపాడు సమీపంలో రహదారిపై మృతదేహం

image

గుంటూరు జిల్లా బుడంపాడు సమీపంలో రహదారిపై బుధవారం వృద్ధుడి మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. నారాకోడూరు నుంచి బుడంపాడు మార్గంలో రహదారిపై ఓ వృద్ధుడు పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులకు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2024

ప.గో 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

image

కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.

News April 10, 2024

తిరుపతి: ఆరు సార్లు ఎంపీ… మరోసారి బరిలోకి

image

తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత చింతామోహన్ దే. 1984లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 1989, 1991, 1998, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి లోక్ సభలో ప్రవేశించారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.

News April 10, 2024

చిత్తూరులో ఎండలు.. కాస్త తగ్గుముఖం.

image

వారంరోజులుగా నిప్పుల కొలిమిని తలపించిన ఎండలు.. చిత్తూరులో మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. మండలాలవారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. శ్రీరంగరాజపురంలో 39.4, నిండ్రలో 39.0, విజయపురంలో 38.9, నగరిలో 38.9, పుంగనూరులో 38.8, గుడిపాలలో 38.7, తవణంపల్లెలో 38.3, గుడుపల్లెలో 38.0, పాలసముద్రంలో 37.8, చిత్తూరులో 37.6, సదుంలో 37.6, శాంతిపురంలో 37.4, కుప్పంలో 37.1, బంగారుపాళ్యంలో 37.0, నమోదయ్యాయి.