Andhra Pradesh

News September 19, 2024

రాజమండ్రిలో పలు రైళ్లకు హాల్ట్ కల్పించిన ద.మ రైల్వే

image

కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో కోవిడ్ సమయంలో నిలిపి వేసిన పూరి-తిరుపతి, బిలాస్ పూర్-తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొవ్వూరులో హాల్ట్ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి-పూరీల మధ్య ఎక్స్ ప్రెస్ ఐదు రోజులు, బిలాస్ పూర్-తిరుపతి మధ్య రెండు రోజులు రైలు నడుస్తున్నాయి. భువనేశ్వర్ రామేశ్వరం పుదుచ్చేరి-హౌరాల మధ్య ప్రయాణిస్తున్న వారాంతపు ఎక్స్ ప్రెస్‌లకు రాజమండ్రిలో హాల్ట్ కల్పించారు.

News September 19, 2024

శ్రీకాకుళంలో ప్రేమ పేరుతో ఛీటింగ్

image

శ్రీకాకుళానికి చెందిన బాలికను ఒడిశాకు చెందిన యువకుడు మోసం చేశాడని పోలీసులను తెలిపింది. వారి వివరాలు.. బాలికకు రెండేళ్ల కిందట పెళ్లిలో కృష్ణ పరిచయమయ్యాడు. అతను పొక్లెయిన్ డ్రైవర్‌గా పైడిభీమవరంలో ఉండేవాడు. పరిచయమైనప్పటి నుంచి ప్రేమపేరిట తిరిగి, పెళ్లి చేసుకోమంటే తప్పించుకుంటున్నాడని తెలిపింది. దీనిపై శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ASI నారాయణ రావు బుధవారం తెలిపారు.

News September 19, 2024

VZM: ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్న మంత్రి

image

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల రుణం మంజూరు చేసింది. సొంతకారు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ రుణం ఇచ్చింది. ఆమె వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం రుణాన్ని మినహాయించుకుంటుంది. మంత్రి హోదాలో ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం ప్రోటోకాల్ కాన్వాయ్ ఇస్తున్నప్పటికీ, సొంత కారు కోసం ఆమె ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు.

News September 19, 2024

నెల్లూరు: నవంబర్ 10 నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ అన్నారు. కలెక్టరేట్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన్ పునీత్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు, JC అదితి సింగ్, రిక్రూట్మెంట్ అధికారితో సమావేశమయ్యారు. కడపలో ఎంపికలు జరుగుతాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల అభ్యర్థులు హాజరుకావాలని అన్నారు.

News September 19, 2024

భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

image

భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

News September 19, 2024

నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసుల పీటీ వారెంట్

image

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతిచెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేశ్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 19, 2024

ఏలూరు: కాలువలో దిగి బాలుడు మృతి

image

ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్‌కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 19, 2024

స్వచ్ఛతా హీ సేవా సెల్ఫీ దిగిన కలెక్టర్

image

కలెక్టర్ అరుణ్ బాబు స్వచ్ఛతా హీ సేవకు మద్దతు తెలుపుతూ సెల్ఫీ దిగారు. ఐటీసీ బంగారు భవిష్యత్, సెర్చ్ ఎన్జీవో జిల్లా నీరు పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఐ సపోర్ట్ స్వచ్ఛ భారత్ అనే అంశంపై కలెక్టరేట్‌లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. దీనిలో కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు సెల్ఫీ దిగి తమ మద్దతు తెలిపారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల స్థాయిలో తమ తోడ్పాటు అందజేస్తామని చెప్పారు.

News September 19, 2024

ప్రకాశం జిల్లా యువకులకు గమనిక

image

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఎందరో యువకులు ఎదురు చూస్తున్నారు. వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కడప నగరంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ మేరకు కడప మున్సిపల్ స్టేడియంలో అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లా యువకులు సైతం ఇందులో పాల్గొనవచ్చు. మరి ర్యాలీకి మీరు సిద్ధమా..?

News September 19, 2024

CM సహాయనిధికి చంద్రగిరి మాజీ MLA రూ.2 కోట్లు విరాళం

image

వరద బాధితుల సహాయార్థం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు పాల్గొన్నారు.