Andhra Pradesh

News April 10, 2024

అనంత: పెరిగిన టమాటా ధరలు.. రైతుల హర్షం వ్యక్తం

image

కూడేరు: పది రోజులుగా మార్కెట్‌లో టమాటా ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో రూ.40 పలుకుతోంది. ఇన్ని రోజులూ కిలో రూ.10 లోపే ఉండేది. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. 15 కేజీల టమాట బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 10, 2024

నెల్లూరు: పెట్రోల్ తాగి బాలుడి మృతి

image

పెట్రోల్ తాగి అస్వస్థతకు లోనైన రెండేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. నెల్లూరు నగరంలోని ఇరుగాళ్లమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా దంపతుల కుమారుడు కాలేషా.. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వాటర్ బాటిల్లో అడుగున ఉన్న పెట్రోల్ ను తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

News April 10, 2024

VZM: భద్రాచలానికి ప్రత్యేక బస్సు.. టైమింగ్స్ ఇవే

image

శ్రీరామనవమి సందర్భంగా విజయనగరం నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం డిపో నుంచి బస్సు బయల్దేరి, ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడికి చేరుకుంటుందన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి బయల్దేరి సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడకు వస్తుందని చెప్పారు.

News April 10, 2024

విశాఖ: టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్

image

విశాఖపట్నంకు చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ మంగళవారం టీడీపీలో చేరారు. ఈ మేరకు ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. ఇటీవల సుధాకర్ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News April 10, 2024

చీరాలలో త్రిముఖ పోరు.?

image

చీరాలలో రాజకీయం రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన YCP నుంచి కరణం వెంకటేశ్, TDP నుంచి కొండయ్య పోటీ పడుతుండగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో చీరాలలో త్రిముఖ పోటీ తప్పదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చీరాల నుంచి రెండు సార్లు గెలిచిన ఆమంచికి బలమైన కేడర్ ఉన్నా TDP, YCPపై గెలిచేనా?

News April 10, 2024

బీసీవై పార్టీ పత్తికొండ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లు

image

భారత చైతన్య యువజన పార్టీ(బిసివై) పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మంగళవారం ప్రకటించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వెంకటేశ్వర్లు సామాన్య రైతు కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. బీసీ యువనేతగా ఉన్న ఆయనకు సర్వే ద్వారా సీటు కేటాయించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

News April 10, 2024

12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ

image

ఈ నెల 12న గుంటూరు నగరంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12న సీఎం జగన్ యాత్ర సత్తెనపల్లి, పేరేచర్ల, నల్లపాడు మీదుగా గుంటూరులోని ఏటుకూరు సెంటర్‌కు చేరుకుంటుదన్నారు. అక్కడ సభలో జగన్ ప్రసంగిస్తారని చెప్పారు.

News April 10, 2024

టెక్కలి ఎమ్మెల్యే పీఠం ఎవరిదో?

image

టెక్కలి నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 2024లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.

News April 10, 2024

VN.పల్లి: ఈతకు వెళ్లి బాలుడు మృతి

image

సంగమేశ్వర ఆలయం సమీపంలోని సంగాల మడుగులో పడి తాటిమాకుల పల్లెకు చెందిన సంజయ్ కుమార్(13) అనే బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సంజయ్ కుమార్ స్నేహితులతో కలిసి సంఘాల మడుగులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడి మృతితో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది.

News April 10, 2024

TTD JEOగా అనంత జిల్లా మాజీ కలెక్టర్ గౌతమి

image

టీటీడీ విద్య, వైద్య విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గౌతమిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. చిత్తూరు జిల్లా వాసి అయిన ఈమె గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎండోమెంట్ రెవెన్యూ విభాగంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బదిలీ నిమిత్తం తిరుపతి జేఈఓగా వెళ్లనున్నారు.