Andhra Pradesh

News April 10, 2024

రామభద్రపురం: నిన్న టీడీపీ లోకి… నేడు వైసీపీ లోకి

image

మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. స్థానిక మండల వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని చెప్పారు.

News April 10, 2024

ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

image

అనంతపురం నగరంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని STPO కార్యాలయంలో నగర పోలీస్ అధికారులతో సమావేశమై, ఎన్నికల వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. నగరం, పోలీస్ స్టేషన్ల పరిధిలో, భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

News April 10, 2024

కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం(MTM), తిరుపతి(TPTY) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07121 TPTY- MTM మధ్య నడిచే రైలును ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి ఆదివారం, నెం.07122 MTM- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, పెడన, గుడివాడ స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News April 9, 2024

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: జేసి గోపాలకృష్ణ

image

ప్రకాశం భవనంలోని స్పందన హాలులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.

News April 9, 2024

కాంగ్రెస్ ఏలూరు MP అభ్యర్థిగా కావూరి లావణ్య

image

ఏలూరు MP అభ్యర్థిగా కావూరి లావ‌ణ్యను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక్కడి నుంచి కావూరి సాంబ‌శివ‌రావు 2004, 2009 ఎన్నిక‌ల్లో 2సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ‘కావూరి’ ఫ్యామిలీకి చెందిన NRI లావ‌ణ్య కాంగ్రెస్ త‌ర‌పున బరిలో దిగుతున్నారు. సాంబశివరావు కేంద్ర మంత్రిగా ఏలూరులో త‌నదైన ముద్ర వేశారు. కాగా.. ఇక్కడ వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, కూటమి నుంచి పుట్టా మహేశ్ బరిలో ఉన్నారు.

News April 9, 2024

టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి

image

టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీచేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేయగా.. కృపారాణి పేరు అందులో ఖరారైంది. వైసీపీని వీడిన ఆమె ఇటీవలే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తెలిసిందే.

News April 9, 2024

నెల్లూరు MP అభ్యర్థిగా రాజు

image

కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు పేరు ఖరారైంది. గతంలో ఆయన జాతీయ ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్‌గా పని చేశారు. రాహుల్ గాంధీ అంతరంగికుడిగా కీలకంగా వ్యవహరించారు. దీంతో నెల్లూరు ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు.

News April 9, 2024

ఆస్పరి: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నగరుకు చెందిన ముత్తుకూరు రాముడును అరెస్టు చేసినట్టు సీఐ హనుమంతప్ప మంగళవారం తెలిపారు. బిణిగేరికి చెందిన మతిస్థిమితం లేని మహిళను రాముడు ఆదివారం రాత్రి బలవంతంగా అత్యాచారం చేస్తుండగా కొందరు వెళ్లేసరికి అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం బాధితురాలు అన్న ఫిర్యాదు మేరకు ఆస్పరిలో పోలీసులు అరెస్టు చేశారు.

News April 9, 2024

సంతమాగులూరులో రేపు సీఎం బస్సు యాత్ర

image

సంతమాగులూరు మండలంలో రేపు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. 12వ రోజు యాత్రలో భాగంగా జగన్ గంటవారిపాలెం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు. జిల్లా పరిధిలోని వెల్లలచెరువు, కామేపల్లి పుట్టవారిపాలెం జంక్షన్‌లలో ఈ యాత్ర సాగనుందని పార్టీ నేతలు తెలిపారు. విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారని చెప్పారు. 

News April 9, 2024

అనంత: ‘ఎన్నికల మస్కెట్ రూపొందించండి’

image

సార్వత్రిక ఎన్నికల మస్కట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఎన్నికల మస్కట్ రూపకల్పనలో జిల్లా ప్రజలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్లు, కేజీబీవీ పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాలలు, జేఎన్టీయూ, ఎస్కేయు, పెయింటింగ్ సంస్థలు ఎన్నికల మస్కట్ రూపకల్పనలో పాలుపంచుకోవచ్చన్నారు.