Andhra Pradesh

News April 9, 2024

చిత్తూరు జిల్లాలో చంద్రబాబుదే రికార్డ్

image

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు. ఆయన 1978లో చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 1983లో అక్కడ ఓడిపోయారు. 1985లో ఎక్కడా పోటీ చేయలేదు. 1989 నుంచి వరుసగా ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6 సార్లు విజయం సాధించారు. పీలేరు, పుంగనూరు నుంచి మూడేసి సార్లు MLAగా ఎన్నికయ్యారు.

News April 9, 2024

నెల్లూరు, తిరుపతిలో ఒకేలా ప్రజాతీర్పు

image

నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మూడు దశాబ్దాలుగా ప్రజా తీర్పు ఒకేలా ఉంటోంది. 1989, 91, 96, 98లో రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. 1999లో నెల్లూరులో టీడీపీ, తిరుపతి ఎంపీగా టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో.

News April 9, 2024

కృష్ణా: పీజీ విద్యార్థుల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీవాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు. 

News April 9, 2024

విశాఖలో అత్యల్ప పోలింగ్ ఇక్కడే.. ఈసారి పెరిగేనా?

image

ఉమ్మడి విశాఖలో 2019 ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. భీమిలి-74.8, విశాఖ ఈస్ట్-63.7, విశాఖ సౌత్-60, విశాఖ నార్త్-63, గాజువాక-64.2, చోడవరం-82.8, మాడుగుల-82.9, అరకు-71.3, పాడేరు-61.9, అనకాపల్లి-77.4, పెందుర్తి-74.5, యలమంచిలి-85, పాయకరావుపేట-81.3, నర్సీపట్నం- 82.7 శాతం నమోదు కాగా, విశాఖ వెస్ట్-56.9 శాతం నమోదు అయ్యింది.

News April 9, 2024

VZM: జిల్లాలో అత్యల్ప పోలింగ్ ఇక్కడే.. ఈసారి పెరిగేనా?

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. కురపాం-77.7, పార్వతీపురం- 76.9, సాలూరు-79.4, బొబ్బిలి-78.9, చీపురుపల్లి-83.3, గజపతినగరం-86.9, నెల్లిమర్ల-87.9, ఎస్.కోట-86.1 శాతంగా నమోదు కాగా విజయనగరంలో అత్యల్పంగా 70.8 శాతం నమోదయ్యింది. ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారో కామెంట్ చేయండి.

News April 9, 2024

శ్రీకాకుళం: BCY ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

image

శ్రీకాకుళం జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. శ్రీకాకుళం అభ్యర్థి పొనీల ప్రసాద్, ఇచ్ఛాపురం అభ్యర్థి బడ్డి మురళి, ఆమదాలవలస అభ్యర్థి సీపాన శ్రీనివాసరావులను ఆయన ప్రకటించారు. మొదటి జాబితాలో మొత్తం 32 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.

News April 9, 2024

సోమఘట్ట వాసి తెలంగాణలో అనుమానాస్పద మృతి

image

చిలమత్తూరు మండలంలోని సోమఘట్టకు చెందిన నరసింహులు (40) తెలంగాణాలోని గద్వాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం చిలమత్తూరు ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమఘట్టకు చెందిన టీడీపీ నాయకుడు తిప్పారెడ్డికి గద్వాల్లో కోళ్ల ఫారంలో పనిచేసేందుకు నరసింహులు వెళ్లారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

REWIND: ధూళిపాళ్లకు డబుల్ హ్యాట్రిక్ మిస్

image

పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్రకు మంచి రికార్డ్ ఉంది. ఆయన వరుసగా 1994, 99, 2004, 2009, 2014లో TDP ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓడిపోయారు. కేవలం 1112 ఓట్లతో డబుల్ హ్యాట్రిక్ విజయం ముంగిట బోల్తా కొట్టారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీతో ధూళిపాళ్ల తలపడనున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి మీ కామెంట్.

News April 9, 2024

విశాఖ-భవానిపట్నం రైలు రీ షెడ్యూల్

image

విశాఖ భవానిపట్నం మధ్య నడిచే పాసింజర్ స్పెషల్ ట్రైన్ మంగళవారం రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. లింకు ట్రైన్ ఆలస్యం అవుతున్న కారణంగా దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు.

News April 9, 2024

BREAKING: నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం

image

నంద్యాలటీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి NMD ఫరూక్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం కర్నూల్ వెళుతుండగా పాణ్యం సమీపంలోని తమ రాజుపల్లె వద్ద ఫరూక్ కాన్వాయ్ అదుపుతప్పి బర్రెలను ఢీకొంది. దీంతో కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో మాజీ మంత్రి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. పాణ్యం అభ్యర్థి గౌరు చరిత అక్కడికి చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలించారు.