Andhra Pradesh

News April 9, 2024

అనంతలో ఈసెట్‌కు 26,436 దరఖాస్తులు

image

అనంతపురం జిల్లా ఏపీ ఈసెట్ 2024కు మొత్తం 26,436 దరఖాస్తులు అందినట్లు ఏపీ ఈసెట్ రాష్ట్ర ఛైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాస్ రావు, రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి మీడియాకు తెలిపారు. ఏపీ ఈసెట్ దరఖాస్తుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.2వేల అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు, రూ.5వేల రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 9, 2024

పార్వతీపురం: ఘనంగా ఉగాది వేడుకలు

image

శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది వేడుకలు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింటు కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని, అన్ని కుటుంబాలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలగాలని జాయింటు కలెక్టర్ ఆకాక్షించారు.

News April 9, 2024

NTR: ప్రయాణీకుల రద్దీ మేరకు రేపు ప్రత్యేక రైలు 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు బుధవారం విజయవాడ మీదుగా భువనేశ్వర్- మైసూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ (నెం. 06216)భువనేశ్వర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి గురువారం ఉదయం 03.25 నిమిషాలకు విజయవాడ, రాత్రి 7.15కి మైసూరు చేరుకుంటుందన్నారు. ఈ ట్రైన్ ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు. 

News April 9, 2024

100 నిముషాల్లో చర్యలు తీసుకుంటాం: DK బాలాజీ

image

సి – విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదుల గురించి కలెక్టర్ DK బాలాజీ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సి – విజిల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను 100 నిముషాల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నంలోని డీఈఓ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిశీలన కేంద్రంలో విధులలో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

News April 9, 2024

కడప: కదిలే రైలు ఎక్కుతుండగా ప్రమాదం

image

కడప రైల్వే స్టేషన్‌లో కేరళకు చెందిన అధిలా(22) అనే వైద్య విద్యార్థి గాయపడ్డాడు. నీటి కోసం రైలు దిగాడు. తిరిగి ఎక్కడానికి ప్రయత్నించగా అప్పటికే రైలు కదిలింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. గమనించిన తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఎడమ మోకాలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

చెరువులు నింపేందుకు చర్యలు: కలెక్టర్‌

image

కలెక్టర్‌ డీకే బాలాజీ సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య ఉన్న పెడన, కత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం రూరల్‌, నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి చెరువులు నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని జిల్లాలో అన్ని చెరువులు నింపేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

News April 9, 2024

కడప: ప్రత్యేక రైలు గడువు పొడిగింపు

image

కడప మీదుగా రాజస్థాన్‌ రాష్ట్రంలోని భగత్‌కి కోటికి వెళ్లే ప్రత్యేక రైలు గడువును మే 1వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. భగత్‌కి కోటి (04811) నుంచి ఈనెల 18, 27 తేదీల్లో బయలుదేరే రైలు కడప మీదుగా కోయంబత్తూరుకు వెళుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు (04812) నుంచి ఈనెల 22, మే 1 తేదీలలో బయలుదేరి భగత్‌కి కోటికి చేరుతుందన్నారు.

News April 9, 2024

ఈనెల 16న ఎమ్మిగనూరుకు నందమూరి బాలకృష్ణ రాక

image

ఈనెల 16న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ రోడ్ షో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వేముగోడు, పుట్టపాశం, హెచ్.కైరవాడి, గాజులదిన్నె స్టేజ్, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటారన్నారు. సాయంత్ర 4 గంటలకు శివా సర్కిల్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News April 9, 2024

పవన్ కళ్యాణ్‌తో రఘురామ భేటీ

image

చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News April 9, 2024

నెల్లూరు సిటీ బీసీవై పార్టీ అభ్యర్థిగా చెంచు మహేశ్

image

భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కాళహస్తి చెంచు మహేశ్ బరిలో నిలవబోతున్నారు. ఈ మేరకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్ధిగా చెంచు మహేశ్‌ను ప్రకటించారు.