Andhra Pradesh

News April 9, 2024

మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తే ఉపేక్షించం: డీఐజీ హెచ్చరిక

image

మద్యం అక్రమ రవాణాదారులకు కొంతమంది సెబ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, విచారణలో నిజమని తేలితే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు హెచ్చరించారు. నుంచి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల సెబ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. చెక్‌పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా మద్యం, డబ్బు, కానుకలు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.

News April 9, 2024

REWIND: వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా మాకినేని పెదరత్తయ్య

image

ప్రత్తిపాడు నుంచి మాకినేని పెదరత్తయ్య వరుసగా 5సార్లు MLA అయ్యారు. 1983, 85, 89, 1994, 1999లో ఆయన TDP నుంచి విజయం సాధించారు. ఈయన మొత్తం 6సార్లు పోటీ చేయగా, 2004లో రావి వెంకటరమణ చేతిలోనే ఓడిపోయారు. ఈయన బరిలో నిలిచిన అన్నిసార్లు కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను బరిలో దించింది. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి బలసాని కిరణ్ కుమార్, కూటమి నుంచి బి.రామాంజనేయులు బరిలో ఉన్నారు.

News April 9, 2024

విజయనగరం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు విజయనగరం డిపో మేనేజరు జే.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు ఏప్రిల్ 16 సాయంత్రం 4.30 నుంచి బయలుదేరునని, టిక్కెట్లు కావలసినవారు WWW.APSRTCONLINE.IN ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చునని తెలిపారు.

News April 9, 2024

కొత్త ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం: పవన్ కళ్యాణ్

image

రాష్ట్ర ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చేబ్రోలులో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంవత్సరమంతా బాగుండాలని, ముఖ్యంగా రైతన్నకు అభివృద్ధి ఉండాలన్నారు. అంతేగాక రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని కూడా స్ధాపించబోతున్నామని తెలిపారు.

News April 9, 2024

ప్రొద్దుటూరులో దారుణం.. తండ్రి కొట్టడంతో బాలుడి మృతి 

image

ప్రొద్దుటూరులో కన్న తండ్రి కొడుకును కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని ఇమ్రాన్ అలీకి కూతురు రబీనా, కొడుకు ముస్తఖీం (4) ఉన్నారు. కొడుకు పుట్టిన 4 రోజులకే భార్య షాబిరున్ అనారోగ్యంతో మృతిచెందారు. ఇమ్రాన్ ఏడాదిన్నర క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ముస్తఖీంను ఇమ్రాన్ కొట్టడంతో బాలుడు చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీకాంత్ తెలిపారు.

News April 9, 2024

ఉగాది స్పెషల్.. పైడితల్లమ్మకు ప్రత్యేక అలంకరణ

image

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్బంగా విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. నైవేద్యంగా బూరెలు, అరెసెలు, పండ్లు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

News April 9, 2024

నేడు రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఆమంచి ప్రకటన

image

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం మధ్యాహ్నం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి.. ఏడాది పాటు పర్చూరు వైసీపీ ఇన్‌‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే ఆయనకు చీరాల టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జిల్లా అంతటా తీవ్ర ఆసక్తిగా మారింది. 

News April 9, 2024

విశాఖ-కిరండోల్ రైలు రద్దు

image

వాల్తేర్ డివిజన్‌లోని కేకే లైన్‌లో బొర్రా గుహల నుంచి కరకవలస మధ్య వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే రైలును రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. విశాఖ నుంచి బయలుదేరాల్సిన కిరండోల్ రైలు(08551)ను ఈనెల 10న రద్దు చేశారు. అలాగే కిరండోల్ నుంచి బయలుదేరే (08552) రైలు కూడా రద్దయింది. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.

News April 9, 2024

అనంత: హుబ్లీ- విజయవాడ మధ్య ఉగాది ప్రత్యేక రైలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రైళ్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం హుబ్లీ-విజయవాడ- హుబ్లీ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ-హుబ్లీ (నెం.07001) ప్రత్యేక రైలు ఈ నెల 10న విజయవాడలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు హుబ్లీ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని కోరారు.

News April 9, 2024

తిరుపతి: వేసవికి ప్రత్యేక రైళ్లు

image

వేసవి సెలవుల నేపథ్యంలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి- మచిలీపట్నం (07121) రైలు ఏప్రిల్ 14, 21, 28 తేదీల్లో, మే 5, 12, 19, 26 తేదీల్లో నడపనున్నారు. మచిలీపట్నం- తిరుపతి (07122) రైలు ఏప్రిల్ 15, 22, 29 తేదీల్లో, మే 6, 13, 20, 27 తేదీల్లో నడవనుంది. ఈ ప్రత్యేక రైళ్లు నిర్దేశించిన తేదీల్లో తిరుపతి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళుతాయి .