Andhra Pradesh

News April 9, 2024

చీరాల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి 

image

కూలి పనులకి ఆటోలో వెళుతుండగా ప్రమాదవశాత్తు మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డులో జరిగింది. చేనేతపురికి కాలనీకి చెందిన మస్తానీ కొందరు కూలీలతో కలిసి వ్యవసాయ పనులకు ఆటోలో బయలు దేరారు. ఆటోలో వెనుక వైపు కూర్చున్న ఆమెకు ఎద్దుల బండిలో తరలిస్తున్న రేకులు ప్రమాదవశాత్తు కడుపులో దిగాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది.

News April 9, 2024

చిత్తూరు: వేడెక్కిన నగరం.. రహదారులు ఖాళీ

image

చిత్తూరు నగరం మండే ఎండలతో వేడెక్కింది. సోమవారం ఉదయం 11 గంటలు దాటగానే చాలా రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. సోమవారం అత్యధికంగా తవణంపల్లెలో 42.3, నిండ్రలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా.. నగరిలో 41.6, విజయపురంలో 41.6, శ్రీరంగరాజపురంలో 41.4, పుంగనూరులో 40.4, సోమలలో 40.1, బంగారుపాళ్యంలో 39.9, పాలసముద్రంలో 39.9, కార్వేటినగరంలో 39.8, గుడిపాలలో 39.7, సదుంలో 39.7 నమోదయింది.

News April 9, 2024

‘దుస్తులను ఇస్త్రీ చేసిన ఆత్మకూరు ఎమ్మెల్యే’

image

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం రాత్రి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దుస్తులను ఇస్త్రీ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News April 9, 2024

అనంత: పండుగ రోజే వివాహిత ఆత్మహత్య

image

పామిడి మండలం పాళ్యం తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పామిడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

News April 9, 2024

రంపచోడవరం సీపీఎం అభ్యర్థిగా లోతా రామారావు

image

ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా రంపచోడవరం సీపీఎం అభ్యర్థిగా లోతా రామారావుకు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, రంపచోడవరం నుంచి వైసీపీ బరిలో నాగులపల్లి ధనలక్ష్మీ ఉండగా.. కూటమి అభ్యర్థిగా మిర్యాల శిరీషా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.

News April 9, 2024

శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు 740 మంది పోలీసులు

image

శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు సుమారు 740 మంది పోలీసులను నియమించినట్లు ఎస్పీ రఘువీరా రెడ్డి తెలిపారు. వీరిలో డీఎస్పీలు 9 మంది, సీఐలు 30, ఎస్సైలు 62, ఏఎస్సైలు 186, కానిస్టేబుళ్లు 247, మహిళా కానిస్టేబుళ్లు 44, హోమ్ గార్డులు 171 మందిని విధులకు నియమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపేలా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

News April 9, 2024

వాలంటీర్లు రాజీనామా చేయవద్దు: కోటంరెడ్డి

image

వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని.. నెల్లూరు రూరల్ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంద్రబాబు కొనసాగిస్తారని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డి మాట్లాడారు.

News April 9, 2024

కొవ్వలి: 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

దెందులూరు మండల పరిధిలోని కొవ్వలి గ్రామంలో 30 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామని, అలాంటి మాపై చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా తమపై నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, దానిని సహించలేక రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు.

News April 9, 2024

పల్నాడు: నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.?

image

సీఎం జగన్ నేడు ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నారు. నేడు శావల్యాపురం మండలంలోని గంటావారిపాలెంలో వేడుకల్లో పాల్గొననున్న ఆయన, మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉగాది రోజు మేనిఫెస్టో ప్రకటన ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

News April 9, 2024

అద్దంకిలో ఆ రికార్డ్ బద్దలయ్యేనా..

image

2009లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవి కుమార్ 15,764 ఓట్లు మెజార్టీతో విజయం సాధించగా.. 1999లో టీడీపీ నుంచి బి.గరటయ్య కేవలం 249 ఓట్లతో గెలిచారు. అద్దంకిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా.. గొట్టిపాటికి వచ్చిన 15,764 ఓట్ల మెజార్టీనే అత్యధిక రికార్డు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి హనిమిరెడ్డి, కూటమి నుంచి మరోసారి గొట్టిపాటి బరిలో ఉన్నారు. ఈయన రికార్డును హనిమిరెడ్డి బ్రేక్ చేయగలరనుకుంటున్నారా.