Andhra Pradesh

News April 9, 2024

కేశేపల్లిలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

image

నార్పల మండల పరిధిలోని కేశేపల్లిలో సోమవారం రాత్రి నాగానంద అనే చేనేత కార్మికుడు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగానందం ఆర్థిక ఇబ్బందులతోనే ఉరి వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడు నాగానందానికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News April 9, 2024

చిత్తూరు: రాజకీయ పార్టీలకు ఎస్పీ సూచనలు

image

ఇంటింటి ప్రచారం కోసం ముందస్తుగా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని రాజకీయ పార్టీలకు ఎస్పీ మణికంఠ సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో బాణసంచా ఉపయోగించరాదన్నారు. పోస్టాఫీసులు, బ్యాంకుల నుంచి నగదును ఇతర పోస్టాఫీసులు, బ్యాంకులకు తరలిస్తుంటే ఆయా రిటర్నింగ్‌ అధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, వివిధ బృందాల అధికారులు,నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

News April 9, 2024

నెల్లూరు సిటీ సీపీఎం అభ్యర్థిగా మూలం రమేశ్

image

ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ సీపీఎం అభ్యర్థిగా మూలం రమేశ్‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, నెల్లూరు సిటీ నుంచి వైసీపీ బరిలోఎండీ ఖలీల్, కూటమి అభ్యర్థిగా పొంగూరు నారాయణ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.

News April 9, 2024

ప్రకాశం: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

అనారోగ్యంతో వృద్ధుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాళ్లూరు పట్టణములోని కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కోటారామిరెడ్డి (75) కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. ఇరుగుపొరుగువారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 9, 2024

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 248 పోలింగ్ కేంద్రాలు

image

అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 248 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.744 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని ఎన్నికల సంఘానికి నివేదించారు. సున్నిత పోలింగ్ కేంద్రాలు 281 ఉండగా.. అత్యంత సున్నితమైనవి 211 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 7,61,255 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఎన్ని కల నాటికి కొద్దిగా పెరిగే అవకాశాలున్నాయి.

News April 9, 2024

ఉగాదికి చౌడేశ్వరి దేవి ఆలయం ముస్తాబు

image

ఉగాది ఉత్సవాలకు కల్లూరులోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగు రంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఉత్సవాలకు కర్నూలు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగాది రోజున బురదలో ఎద్దులు, గాడిదలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇక్కడి విశేషం.

News April 9, 2024

విజయనగరం: సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలు

image

విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సర్టిఫికెట్, డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కేఏవీఎల్ఎన్ . శాస్త్రి బుధవారం తెలిపారు. భారతీయ సంస్కృతి, కళల పట్ల అవగాహన కలిగించి ఆకర్షితులను చేసే ఉద్దేశంతో సంగీత కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు.

News April 9, 2024

కుక్కునూరులో ఘరానా మోసం

image

కుక్కునూరులో ఆదివారం జరిగిన ఓ ఘరానా మోసం ఆలస్యంగా వెలువడింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంక్ యజమానికి ఆదివారం ఓ కొత్త నంబర్‌తో ఫోన్ వచ్చింది. తాను ఏఎస్ఐనని అర్జెంటుగా నగదు అవసరమని గుర్తు తెలియని వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో రూ.34 వేల నగదును యజమాని సిబ్బంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు. మోసపోయారని ఆలస్యంగా తెలియడంతో మండల పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు.

News April 9, 2024

ఇచ్చాపురం: ఎర్నాకులంకు కొత్త రైలు సేవలు

image

బ్రహ్మపురం- ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు(06087/06088) సేవలు సోమవారం ఇచ్చాపురంలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22 సెకండ్ క్లాస్ భోగిలతో కూడిన ఈ రైలు ఇచ్చాపురం స్థానిక రైల్వే స్టేషన్లో ఆగింది. బ్రహ్మపురలో మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ప్రారంభమైన ఈ రైలు ఇచ్చాపురం, పలాస,శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గూడూరు, మీదుగా తమిళనాడు, ఎర్నాకులం కు చేరుతుంది.

News April 9, 2024

సింహాచలం: నేడు సింహాద్రి అప్పన్నకు పెళ్లి రాట

image

సింహాచలం ఆలయంలో ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం అప్పన్న బాబు పెళ్లి రాట మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 19వ తేదీన స్వామి వారి వార్షిక కళ్యాణం నిర్వాహంలో భాగంగా ఈ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయ ఆస్థానం మండపం వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహిస్తారన్నారు.