Andhra Pradesh

News August 24, 2025

‘కార్పొరేటర్ల భద్రతను పట్టించుకోని జీవీఎంసీ’

image

జీవీఎంసీ ప్రతి ఏటా కార్పొరేటర్ల కోసం స్టడీ టూర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో గాలికి వదిలేస్తుందని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు స్టడీ టూర్ ఏర్పాటు చేయగా ప్రతిటూర్‌లో అవకతవకలు, ఇబ్బందులు జరిగాయన్నారు. తిరిగి పాత ట్రావెల్స్ నిర్వహించిన వ్యక్తికే ఈసారి కూడా స్టడీ టూర్ అప్పగిస్తున్నారని భద్రతను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు.

News August 24, 2025

పెనమలూరు: కీలిమంజారో విజయం.. కలెక్టర్ ప్రశంస

image

పెనమలూరు మండలానికి చెందిన అనుమోలు ప్రభాకరరావు ఇటీవల ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ఘట్టం ప్రేరణగా, యువతలో జైవిక, పర్యాటక అవగాహన పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News August 24, 2025

గోపాలపురంలో నేటి చికెన్ ధరలు

image

గోపాలపురంలో ఆదివారం చికెన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ వారం బ్రాయిలర్ చికెన్ ధర కిలో రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. స్కిన్‌లెస్ చికెన్ రూ.240, ఫారం మాంసం రూ.200, నాటుకోడి మాంసం రూ.400కు విక్రయించారు. దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంతో కామెంట్ చేయండి.

News August 24, 2025

మోపిదేవిలో వీఆర్ఏకు టీచర్ ఉద్యోగం

image

మోపిదేవి తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్న పోలిమెట్ల స్వయంప్రభ, డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించారు. ఎస్ఏ-సోషల్ విభాగంలో 76.94 మార్కులతో ఆమె జిల్లాలో 20వ ర్యాంకు సాధించి బీసీ-ఏ కోటాలో ఉద్యోగం పొందారు. ఉపాధ్యాయురాలిగా మారాలనే తన కోరిక నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

News August 24, 2025

కడప: అక్కాచెల్లెళ్లకు టీచర్ పోస్ట్‌లు

image

పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ మహబూబ్ నగర్‌కు చెందిన టీచర్ ఖాదర్ బాషా కుమార్తెలు DSCలో సత్తా చాటారు. ఎస్.మెహతాబ్(SGT)లో 2వ ర్యాంకు సాధించింది. S.రేష్మ 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైంది. మొహతాబ్ 2వ ర్యాంకుతో పాటు 5 ఉద్యోగాలు సాధించడం, అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ టీచర్ ఉద్యోగాలు రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 24, 2025

DSCలో జువ్వలపాలెం యువకుడికి నాలుగు కొలువులు

image

డీఎస్సీ ఫలితాల్లో కాళ్ల మండలం జువ్వలపాలెంకు చెందిన నడిమింటి రాము ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఉమ్మడి జిల్లాలో 3వ ర్యాంక్, పీఈటీ విభాగంలో జిల్లాలో 3వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో జిల్లా 84వ ర్యాంకు, జోనల్ స్థాయిలో పీడీ విభాగంలో 9వ ర్యాంకు సాధించాడు. గ్రామస్థులు ఈయనను అభినందించారు.

News August 24, 2025

ప్రకాశం: DSC.. సోషల్ ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

image

DSC మెరిట్ జాబితాలో కనిగిరికి చెందిన ఇరువురి వెంకట హర్షిత సత్తా చాటింది. SGT సోషల్‌లో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. SGT ఇంగ్లిష్‌లో 16వ ర్యాంక్, ఎస్జీటీలో 7వ ర్యాంక్, మోడల్ స్కూల్ టీజీటీలో 4వ ర్యాంక్ పొందింది. ఆమె తండ్రి కృష్ణారెడ్డి ప్రభుత్వ టీచర్. హర్షితను పలువురు అభినందించారు.

News August 24, 2025

ఆత్మకూరులో దొంగనోట్ల కలకలం

image

ఆత్మకూరులోని మున్సిపల్ కూరగాయల మార్కెట్లో శనివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. రెండు రూ.200 నోట్లను షాపులలో ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు కొనుగోలు చేసి వెళ్లారు. ఆ షాపు నిర్వాహకులు నోట్లను మరొకరికి ఇచ్చే క్రమంలో దొంగనోట్లుగా తేలింది. దీంతో వారు కంగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరించారు.

News August 24, 2025

తూ.గో: 5.59 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం

image

తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన 5,59,302 స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయిందని, వాటిని తహశీల్దార్ కార్యాలయాలకు పంపినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శనివారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కార్డుదారుల ఇళ్ల వద్దే వీటిని పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News August 24, 2025

శ్రీకాకుళం జిల్లాలో(ఎస్‌ఏ) ఇంగ్లిష్ ఫస్ట్ ర్యాంక్‌ బూర్జ వాసికే

image

ఇటీవల విడుదలైన 2025 డీఎస్సీ ఫలితాల్లో బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన మీసాల గోవిందరావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విజయం పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు , స్నేహితులు గోవిందరావును అభినందించారు.