Andhra Pradesh

News April 8, 2024

షర్మిలను చూస్తుంటే జాలి, బాధేస్తుంది: కడప మేయర్

image

కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్రను చూస్తుంటే తమకు జాలి, బాధ వేస్తోందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేశ్ బాబు ఎద్దేవా చేశారు. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో జగనన్న సోదరిగా ప్రచారానికి వచ్చినప్పుడు జిల్లా ప్రజలు ఆమెకు ఇచ్చిన గౌరవం, పట్టిన బ్రహ్మరథం చూసి ఈరోజు జరుగుతున్న బస్సు యాత్రను చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఇప్పటికైనా షర్మిలమ్మ తెలుసుకోవాలన్నారు.

News April 8, 2024

ప్రాణం ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటా: VSR

image

ప్రాణం ఉన్నంతవరకు తాను CM జగన్‌తోనే ఉంటానని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) అన్నారు. 35 ఏళ్లుగా జగన్ కుటుంబంతో ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆ కుటుంబంతో తన బంధం శాశ్వతమని పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతుల్లా తనకు వెన్నుపోటు పొడవడం, పార్టీలు మారడం తెలియదన్నారు. విడవలూరు రోడ్ షో‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 8, 2024

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దల రాజ్

image

పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు గద్దల రాజు తెలిపారు. ఆదివారం పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి చేయాలని తపనతో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాగు, సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు.

News April 8, 2024

క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ సిబ్బందికి ఎస్పి మాధవరెడ్డి శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగతో అందరి జీవితాల్లో వెలుగు రావాలని, చీకట్లను పారద్రోలి ప్రజల జీవితాల్లో మరిన్ని కాంతులు వెదజల్లాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా నియమ నిబంధనలతో పండుగలు జరుపుకోవాలని , గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.

News April 8, 2024

చిత్తూరు: ఇద్దరు మహిళలకే అవకాశం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 MLA, 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. వైసీపీ జీడీ నెల్లూరు MLA అభ్యర్థిగా కృపాలక్ష్మి, నగరి అభ్యర్థిగా రోజా పోటీ చేయనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మహిళకు అవకాశం దక్కలేదు. గతంలో గల్లా అరుణ కుమారి నాలుగు సార్లు, గుమ్మడి కుతూహలమ్మ ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రులుగా పనిచేశారు.

News April 8, 2024

గాజువాక CPM ఎమ్మెల్యే అభ్యర్థిగా జగ్గు నాయుడు

image

సీపీఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడలో ఆయన పేరును ప్రకటించారు. జగ్గునాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు.

News April 8, 2024

వట్టిచెరుకూరు: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

మండలంలోని ముట్లూరు గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముట్లూరుకు చెందిన అలెక్స్ (24) తన నివాసంలో మంచినీటి మోటారు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. అలెక్స్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ముట్లూరు వచ్చాడు.

News April 8, 2024

ఎన్టీఆర్: ఈ డ్రైవర్ మృత్యుంజయుడు

image

తోటమూల ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీంలో సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఇంజిన్ తిరగబడింది. డ్రైవర్ ట్రాక్టర్ అడుగుభాగాన ఇరుక్కోగా.. సమచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపారు. అయితే ట్రాక్టర్ కింద ఇరుక్కున్న డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పడంతో అందరూ అతన్ని మృత్యుంజయుడన్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తని. దుక్కుల నిమిత్తం ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినట్లు సమాచారం.

News April 8, 2024

తూ.గో: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

యలమంచిలి మండలం కలగంపూడి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి కొబ్బరిదింపు కార్మికులు కాజ గ్రామం వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోనసీమలోని గుడిమూడిలంకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యలమంచిలి SI శివనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్పీ

image

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిందూపురంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో కలిసి కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర బలగాల పోలీసులతో కవాతు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.