Andhra Pradesh

News April 8, 2024

టెక్కలి: వడదెబ్బతో వృద్ధుడి మృతి

image

ఎండ తీవ్రతకు తట్టుకోలేక టెక్కలి మండలం మాధినివానిపేట గ్రామానికి చెందిన నక్క లచ్చయ్య(76) అనే వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. ఆరుబయట స్నానానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై వృద్ధుడు కుప్పకూలిపోయాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకున్న సపర్యలు చేసేలోపే వృద్ధుడు మృతి చెందాడు. ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.

News April 8, 2024

ఓటర్ కార్డు లేకున్నా ఓటుకు అవకాశం: కలెక్టర్

image

ఓటు ఉండి ఎపిక్ కార్డులేని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకదానితో ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డులేని ఓటర్లు ఆధార్, ఉపాధి కార్డు, బ్యాంకు, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కార్మికమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమాస్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉన్నా ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.

News April 8, 2024

విశాఖ: పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

ఉమ్మడి విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో విషాదం నెలకొంది. వనుగుమ్మ పంచాయతీ అసరాడలో పిడుగుపాటుతో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం ఆసరాడ కొండపై పశువుల కోసం వెళ్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. అటుగా వెళుతున్న ఇద్దరు గిరిజనులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ఒకరు పాంగి సుఖదేవ్, మరొకరు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

నిష్పక్షపాత ఎన్నికలే లక్ష్యం: అనంత ఎస్పీ

image

పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్ఐ, ఆ పైస్థాయి పోలీసు అధికారులతో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని, ఎంసీసీ ఉల్లంఘనపై సకాలంలో చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 8, 2024

19న కాణిపాకం హుండీల లెక్కింపు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈనెల 19న లెక్కించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హజరు కావాలని కోరారు.

News April 8, 2024

47 మంది రెగ్యులర్ అధికారులకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్

image

ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని నంద్యాల కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.4.9 కోట్ల విలువైన నగదు, లిక్కర్ సీజ్ చేసినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన 22 మంది వాలంటీర్లను తొలగించినట్లు చెప్పారు. 47 మంది రెగ్యులర్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.

News April 8, 2024

ఏలూరు: ఫ్రెండ్స్‌ని కలిసొస్తూ.. అనంతలోకాలకు..!

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు రైల్వే‌గేట్ షుగర్ ఫ్యాక్టరీ సమీప పట్టాలపై ఆదివారం రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి  వివరాలను హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సోమవారం వెల్లడించారు. ద్వారకాతిరుమల వాసి వై.గణేష్(22) ప.గో జిల్లా నరసాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఫ్రెండ్స్‌ను కలిసి వస్తూ రైలు ప్రమాదానికి గురై గణేష్ మృతి చెందినట్లు తెలిపారు.

News April 8, 2024

సివిల్ సర్వీసెస్ అధికారులపై ఆరోపణలు తగదు: బొత్స

image

నిజాయతీగా పనిచేస్తున్న సివిల్ సర్వీసెస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారులు చాలా కాలం నుంచి ప్రభుత్వ శాఖల్లో కీలకంగా పని చేస్తున్నారని అన్నారు. వారిలో ఇద్దరు, ముగ్గురు కొన్ని పొరపాట్లు చేస్తే అందరిపై అభాండాలు వేయడం తగదన్నారు.

News April 8, 2024

వికలాంగులకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు: కలెక్టర్

image

సాధారణ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించి విభిన్న ప్రతిభావంతులు, 85 ఏళ్లు పైబడిన వారికి కల్పించాల్సిన ఓటు హక్కుపై సంబంధిత అధికారులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

News April 8, 2024

టికెట్ మార్పుపై సర్వే చేపట్టడం సంతోషం: కలమట

image

పాతపట్నం నియోజకవర్గ TDP టికెట్ మార్పు విషయంపై పునఃపరిశీలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం ఐవీఆర్ఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయని స్పష్టం చేశారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు TDP అధిష్ఠానం ఉదయం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతుందన్నారు. సీక్రెట్‌గా సర్వే చేయడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే పాతపట్నం టికెట్ మామిడికి టీడీపీ కేటాయించిన విషయం తెలిసిందే.