Andhra Pradesh

News April 8, 2024

విజయనగరం: 209 మంది వాలంటీర్ల రాజీనామా

image

విజయనగరం జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 209 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం భోగాపురం మండలంలో 18 మంది, కొత్తవలసలో 27 మంది, కొప్పెర్లలో11 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వారి రిజైన్ లెటర్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.

News April 8, 2024

కర్నూలు: వ్యయ పర్యవేక్షణపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన వ్యయ పర్యవేక్షణపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన సమీక్ష నిర్వహించరు. ఆమె మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పెద్దమెుత్తంలో డబ్బులు విత్ డ్రా, డిపాజిట్ చేసేవారిపై డేగకన్ను ఉంచాలన్నారు. అనుమానిత ఖాతాలో నగదు లావాదేవీలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని అధికారులకు తెలిపారు.

News April 8, 2024

తూ.గో: ‘వారంతా 15 రోజుల ముందే ఓటేయొచ్చు’

image

ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలని అనుకునేవారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్దేశించిన వారంతా 15 రోజుల ముందు నుంచే ఇంటి వద్ద నుంచి ఓటు వేయొచ్చన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అమలాపురంలో 15,18,108 మంది, రాజమహేంద్రవరంలో 16,08,504 మంది, కాకినాడలో 16,11,031 మంది ఓటర్లున్నారు. వీరిలో కనీసం లక్ష మందైనా ఇంటి నుంచి ఓటింగ్‌ విధానంలో పాల్గొంటారని అధికారులు అంటున్నారు.

News April 8, 2024

అక్ర‌మ న‌గ‌దు ర‌వాణపై నిఘా పెంచండి: కలెక్టర్

image

ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్ర‌మ న‌గ‌దు లావాదేవీలు, ర‌వాణా జ‌ర‌గ‌కుండా నిఘా పెంచాల‌ని వివిధ శాఖ‌ల జిల్లా అధికారుల‌ను, విజయనగరం జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌, ఇఎస్ఎంఎస్‌ (ఎల‌క్ష‌న్ సీజ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌) నోడ‌ల్ ఆఫీస‌ర్ల స‌మావేశాన్ని క‌లెక్ట‌ర్‌ త‌న ఛాంబ‌ర్‌లో సోమ‌వారం నిర్వ‌హించారు. సీజ‌ర్స్ పెంచి అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని సూచించారు.

News April 8, 2024

ఆస్పరి మండలంలో 200 మంది వాలంటీర్ల రాజీనామా

image

ఆస్పరి మండలంలోని అన్ని గ్రామాల వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మండలంలో మొత్తం 302 మంది వాలంటీర్లు ఉండగా.. 200 మంది తమ రాజీనామాల పత్రాలను ఎంపీడీవోకు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ సేవలు అందిస్తుంటే.. పత్రిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమను అవమానపరచడం సరికాదని అన్నారు. రాజీనామా అనంతరం జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం చేస్తామని అన్నారు.

News April 8, 2024

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు:కలెక్టర్

image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి 24 గంటల్లో దాని పరిష్కారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్ఓలు, ఎఆర్ఓలు, నోడల్ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతులు లేకుండా వారు పని చేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.

News April 8, 2024

పార్వతీపురం: ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు.

News April 8, 2024

వైసీపీకి మాజీ MLC శమంతకమణి రాజీనామా

image

శింగనమల నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి, ఆమె కుమారుడు బలపనూరు అశోక్ వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా పత్రాన్ని పంపుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 8, 2024

అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు:SP

image

అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పి K.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నగదు, మద్యం, నాటు సారా, గంజాయి మొదలగు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు.

News April 8, 2024

రైతులు బాగుపడాలంటే టీడీపీ గెలవాలి:కొండ్రు

image

రాజాం నియోజకవర్గం సంతకవిటి మండల పరిధిలోని గోళ్లవలస గ్రామంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సమావేశంలో నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొండ్రు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అంటూనే రాష్ట్రంలో జగన్ రైతులను నట్టేట ముంచారన్నారు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు తాగునీరు లేని దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.