Andhra Pradesh

News April 8, 2024

కడప దర్గాలో ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు

image

కడపలో ప్రసిద్ధి చెందిన పెద్ద దర్గాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం దర్గాలోని హజరత్ ఖ్వాజా సయ్యద్ షా యద్దుల హుసైని చిస్టివుల్ ఖాద్రీ ఉరుసులో భాగంగా నిన్న రాత్రి గంధ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మంత్రి అంజాద్ బాషాతో కలిసి రెహమాన్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని పాల్గొన్నారు.

News April 8, 2024

కర్నూలు: ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన 35 మందిపై వేటు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మార్చి 16 నుంచి ఇప్పటి వరకు 35మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. కోడ్ ఉల్లంఘించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

News April 8, 2024

విశాఖ: ఈ స్థానాల్లో సైకిల్ గుర్తు లేనట్లేనా..!

image

పొత్తులో భాగంగా ఈసారి విశాఖ ఎంపీ సీటు TDPకి, అనకాపల్లి, అరకు స్థానాలను BJPకి కేటాయించారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP-9, జనసేన-4, BJP-2 ఇచ్చారు. అయితే అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ స్థానాల్లో జనసేన..అరకులో BJP అభ్యర్థి బరిలో ఉన్నారు. దీంతో ఆయా నియోజవర్గాల్లో ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసే అవకాశం లేనట్లే. దీంతో స్థానిక టీడీపీ నేతలు ఉమ్మడి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

News April 8, 2024

REWIND: మాచర్లలో 80 ఓట్ల మెజార్టీతో MLA

image

మాచర్లలో 1967 ఎన్నికల్లో 80 ఓట్ల మెజారిటీతో వెన్న లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈయన జూలకంటి నాగిరెడ్డిని ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యల్ప మెజారిటీ. మరోవైపు, ఇదే నియోజకవర్గంలో పి. లక్ష్మారెడ్డిది అత్యధిక మెజారిటీ. (2004లో 30,666). తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కూటమి నుంచి జూలకంటి బ్రహ్మనందరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

News April 8, 2024

కాకినాడ: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి

image

షటిల్ ఆడుతుండగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. వివరాలు.. తుని పట్టణానికి చెందిన నగల దుకాణదారుడు ఆళ్లనాగు(49)  సోమవారం ఉదయం స్థానిక రాజా క్రీడామైదానంలోని ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడేందుకు వెళ్లాడు. ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపట్ల శ్రీరాజా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.

News April 8, 2024

REWIND.. రికార్డు సృష్టించిన గల్లా అరుణకుమారి

image

చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి ఆరుసార్లు పోటీ చేసి నాలుగుసార్లు గెలిచారు. 1989 కాంగ్రెస్ నుంచి పోటీచేసి NRJ నాయుడుపై గెలిచారు. 1994లో పోటీ చేసి N రామ్మూర్తి నాయుడు చేతిలో ఓడిపోయారు. 1999,2004,2009లో మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. 2014లో పోటీచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈమె మూడుసార్లు మంత్రిగా పని చేశారు.

News April 8, 2024

అనంతపురంలో ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

అనంతపురం ఆర్టీసీ బస్టాండులోని బస్సు ప్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చింది. హిందూపురం డిపోకు చెందిన బస్సు అనంతపురం బస్టాంపు వద్దకు చేరగానే డ్రైవర్ బ్రేక్ వేసినా పడకపోవడంతో ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వైద్య విద్యార్థిని వీణ కాలికి స్వల్ప గాయాలయ్యాయి.

News April 8, 2024

శ్రీశైలం: కృష్ణా నదిలో నీట మునిగి వ్యక్తి మృతి

image

శ్రీశైలం డ్యాం దిగువన గల లింగాలగట్టు హై లెవెల్ పుష్కర ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడని మత్స్యకారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ముగ్గురు మల్లన్న దర్శనార్థమై వచ్చి రద్దీ అధికంగా ఉండటంతో ఆలోగా కృష్ణానదిలో స్నానమాచరించేందుకు లింగాలగట్టుకు చేరుకున్నారు. ముగ్గురు నదిలో దిగి స్నానమాచరిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీట మునిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రారంభమైన వరి కోతలు

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి, అనపర్తి, కాకినాడ జిల్లా పరిధిలో సామర్లకోట, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆలమూరు, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జరిగిన ప్రాంతాల్లో సగటు దిగుబడి 50 బస్తాలు (బస్తా 75 కేజీలు, 37.5 క్వింటాళ్ల) వరకు వస్తోంది. కొన్నిచోట్ల 55 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. మరో 10 రోజుల్లో రబీ కోతలు జోరందుకోనున్నాయి.

News April 8, 2024

అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న కార్తికేయ డైరెక్టర్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవాలయం అధికారులు ఘనస్వాగతం పలికి.. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి జ్ఞాపికను, తీర్థప్రసాదాలు అందజేశారు.