Andhra Pradesh

News April 8, 2024

కొల్లూరు: కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు

image

విద్యుదాఘాతం వల్ల కౌలు రైతు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన రావుల కిరణ్ బాబు పూరిళ్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు, ఆస్తి పత్రాలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది.

News April 8, 2024

నెల్లూరు: రైలు కింద పడి యువకుడి మృతి

image

రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన నెల్లూరు- వేదాయపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం జరిగింది. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 8, 2024

పోలాకి: కూతురిని ఉగాదికి రమ్మని పిలిచొస్తూ మృతి

image

పోలాకి మండలం బార్జిపాడుకు చెందిన గురయ్య(70) నిన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. శ్యామసుందరపురంలో ఉన్న కుమార్తెను ఉగాదికి రావాలని పిలవడానికి వెళ్లి.. తిరుగు ప్రయాణం అయ్యారు. అక్కవరం సమీపంలో రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం టెక్కలి ఆస్పత్రికి తరలించారు.

News April 8, 2024

పరవాడ: ‘మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం’

image

పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో రెండు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించినట్లు సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. సిరిపురానికి చెందిన ఆళ్ల గోవిందు కుటుంబానికి రూ.32.50 లక్షలు, పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ కుటుంబానికి రూ.35 లక్షలు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.

News April 8, 2024

పెద్దవడుగూరు: సజీవ దహనమైన వ్యక్తి ఆచూకీ లభ్యం

image

పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సజీవ దహనమైన విషయం తెలిసిందే. ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పెద్దపప్పూరు మండలం తురకపల్లికి చెందిన నరేశ్‌గా గుర్తించారు. అయితే నరేష్ గుత్తిలో నివాసం ఉండేవాడు.

News April 8, 2024

నంద్యాలలో యువకుడి దారుణ హత్య

image

నంద్యాల పట్టణంలోని దేవనగర్ మసీదు సెంటర్‌లో సమీర్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన వారు అతి కిరాతకంగా సమీర్ గొంతు కోసి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

కడప: కారు ప్రమాదంలో చిన్నారి మృతి

image

రైల్వే కోడూరు చెందిన గోను గొడుగు శివ సురేంద్ర తన తండ్రి దశ దినకర్మకు కుటుంబంతో కలిసి శ్రీకాకుళం నుంచి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం బాపట్ల జిల్లా గుడిపాడు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో చిన్నారి ధార్మిక అక్కడికక్కడే మృతి చెందింది. సురేంద్రతో పాటు ఆయన భార్య , కొడుకు, తల్లి నాగేంద్రమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

News April 8, 2024

శ్రీశైలంలో నేడు వీరాచార విన్యాసాలు..

image

ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో 3 రోజు సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ, శ్రీభ్రమరాంబా దేవికి మహా సరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. శివ దీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాస కార్యక్రమానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

News April 8, 2024

ప్రకాశం జిల్లాలో నేటి జగన్ పర్యటన ఇలా…

image

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ సోమవారం ఇలా సాగనుంది. ఆదివారం రాత్రి దర్శి మండలంలోని వెంకటాచలంలో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు. భోదనంపాడు, కురిచేడు, చీకటిగలపాలెం, కనమర్లపూడి మీదుగా శావల్యాపురం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 8, 2024

VZM: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

image

పరవాడ జెఎన్ ఫార్మాసిటీలోని రెండు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. గంట్యాడ మండలం సిరిపురానికి చెందిన ఆళ్ల గోవింద కుటుంబానికి రూ.32.50 లక్షలు, పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన రమణ కుటుంబానికి రూ.35 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.