Andhra Pradesh

News April 8, 2024

ముగిసిన మూల్యాంకణం: డీఈఓ

image

అనంతపురం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1.81 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షణలో 1వ తేదీ నుంచి అన్ని వసతులు కల్పించారు. డీఈఓ మాట్లాడుతూ.. అందరి సమష్ఠి కృషితోనే జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు, మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 8, 2024

ప.గో.: WARNING.. అప్రమత్తంగా ఉండండి

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన 3 ప్రధాన నగరాలు ఉండటం గమనార్హం. భీమవరంలో 42.0, తాడేపల్లిగూడెంలో 41.0, ఏలూరులో 41.0 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లో సోమవారం వడగాల్పులకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది.
– మీ వద్ద ఎలా ఉంది..?

News April 8, 2024

కర్నూలు: 24 ఓట్ల తేడాతో గెలిచారు

image

ఆదోని నియోజవర్గంలో 1952 నుంచి 2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1955లో జి.భూషన్న అనే పీఎస్పీ అభ్యర్థి ఎస్.ఎమ్. నిజాని(పీపీ) అభ్యర్థిపై 24 ఓట్ల అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2009లో టీడీపీ అభ్యర్థి కె.మీనాక్షినాయుడు కాంగ్రెస్ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డిపై 256 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

News April 8, 2024

నెల్లూరు జిల్లాలో మండుతున్న ఎండలు.. కలిగిరి@45.8

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పలు మండలాలలోని ప్రజలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. కలిగిరి 45.8, జలదంకి 45.0, కోవూరు44,1, మనుబోలు 44.8, వెంకటాచలం 44.6, సైదాపురం 42.7, తోటపల్లిగూడూరు42.0, వరికుంటపాడు 43.9, వింజమూరు 42.9, సూళ్లూరుపేట 44.7, తడ 40.5, పెళ్లకూరు 42.3, ఓజిలి 42.9, నాయుడుపేట 43.5, కోట 42.9, దొరవారిసత్రం 42.8, గూడూరు 44.8, చిల్లకూరు 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 8, 2024

అనంత: ఈ నియోజకవర్గంలో 10వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన వారు నలుగురే..

image

శింగనమల నియోజవకవర్గంలో 1955 నుంచి 2019వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1999లో కె.జయరాం(టీడీపీ) 47198 ఓట్ల తేడాతో నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2019లో జొన్నలగడ్డ పద్మావతి(వైసీపీ) 46,242 ఓట్లతో గెలిచి రెండో స్థానంలో నిలిచారు. ఇలా..1983 కె.ఆనందరావు(టీడీపీ)18903, 1985లో కె.జయరాం(టీడీపీ) 14212 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరూ తప్ప ఏ అభ్యర్థికి 10వేలకుపైగా మెజార్టీ రాకపోవడం గమనార్హం.

News April 8, 2024

తిరుపతి: ఈ మండలాల ప్రజలకు రెడ్ అలర్ట్

image

తిరుపతి జిల్లాలో పలు మండలాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాగలాపురం 40, KVB.పురం 40,నారాయణవనం 42,పాకాల 42,పుత్తూరు 42,చిన్నగొట్టిగల్లు 42, BN.కండ్రిగ 42,పిచ్చాటూరు 43,చంద్రగిరి 42, తొట్టంబేడు 43,తిరుపతి రూరల్ 42,సత్యవేడు 40,రేణిగుంట 41,రామచంద్రాపురం 42,తిరుపతి అర్బన్ 42,వడమాలపేట 42,వరదయ్యపాలెం 39, ఏర్పేడు 40,ఎర్రావారిపాళెం 42 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 8, 2024

విశాఖ: ‘ఇంకా అందని జగనన్న విద్యా దీవెన’

image

విద్యా సంవత్సరం ముగుస్తున్న జగనన్న విద్యాదీవెన నిధులు ఇంతవరకు జమ కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీంతో ఆయా కళాశాలకు ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు చెబుతున్నాయన్నారు. మార్చి 1 తేదీన బటన్ నొక్కి 9 లక్షల మంది విద్యార్థులకు రూ.708 కోట్లు విడుదల చేసామని ప్రభుత్వం గొప్పలు చెప్తుందని అన్నారు.

News April 8, 2024

విశాఖ: పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బిల్లు బకాయిలు

image

ఆరోగ్యశ్రీలో పేదలకు ఉచిత వైద్యం అందించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. జిల్లాలో 55 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తుండగా వాటికి సుమారు ఏడు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో సుమారు రూ.70 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో ఆస్పత్రికి కనిష్టంగా రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

News April 8, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లావాసులకు అలెర్ట్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈరోజు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలోని 20 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News April 8, 2024

ప.గో. జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

image

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని నరేంద్ర కూడలిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు ఏర్పాట్లపై కసరత్తు మొదలుపెట్టారు. ఇరు పార్టీల అధ్యక్షులు సభ నిర్వహణకు ముందు ఒకే వాహనంపై పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ఉండనున్నట్లు నాయకులు చెబుతున్నారు.