Andhra Pradesh

News April 8, 2024

సమస్యలుంటే వాట్సాప్ చేయండి: ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 16.25 లక్షల ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఓటు హక్కు సద్వినియోగంపై జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మే 13న జరగబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం వాట్సాప్ నెం 94910 41435 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే ఫొటో, వీడియోతో పై నెంబరుకు పంపాలని ప్రజలకు సూచించారు.

News April 8, 2024

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా మండల స్థాయి నోడల్ అధికారులను ఆదేశించారు. అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అంశంలో తీసుకున్న చర్యలపై నియోజకవర్గం వారీగా కూలంకషంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు.

News April 8, 2024

కమాండ్ కంట్రోల్, స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఉరవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్, ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు.

News April 8, 2024

విజయనగరం: టీడీపీ పార్లమెంట్ సమన్వయ సమావేశం

image

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో అశోక్ గారి బంగ్లాలో ఎన్డీఏ కూటమి విజయనగరం పార్లమెంట్ సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఎన్నికలలో మూడు పార్టీల కలిసి సమన్వయంతో ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లను గుర్తించడం, పోస్టల్ బ్యాలెట్, బూత్ ఏజెంట్లు మొదలగునవి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిసి ప్రచారం చేయుటకు ప్రణాళికలు మొదలగు వాటిపై కలిసి చర్చించారు.

News April 8, 2024

వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి: డిల్లీరావు

image

వేస‌విలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో వ‌డదెబ్బ బారిన పడకుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నందున ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఎండ తీవ్ర‌త‌కు గురికాకుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. చ‌లివేంద్రాలు స‌జావుగా ప‌నిచేసేలా చూడాల‌ని చెప్పారు.

News April 7, 2024

చేబ్రోలులో జిగేల్‌మంటున్న పవన్ కొత్త ఇల్లు

image

పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేనాని పవన్.. ఆయన స్థానికంగా అందుబాటులో ఉండేందుకు వసతితో పాటు పార్టీ కార్యాలయం కోసం చేబ్రోలులో భవనం ముస్తాబవుతోంది. తుది మెరుగులు దిద్దికుంటోంది . ఉగాది వేడుకలకు పిఠాపురంలోనే ఉండనున్న పవన్.. అదే రోజు ప్రత్యేక పూజలు చేసి గృహప్రవేశం చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో చేబ్రోలులోని భవంతి విద్యుత్ దీపకాంతుల్లో మిరుమిట్లుగోల్పుతోంది.

News April 7, 2024

కర్నూలు: రూ.14,51,520 విలువైన మద్యం పట్టివేత

image

పంచలింగాల చెక్ పోస్టు వద్ద పట్టుబడిన మద్యం కేసు వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రవికుమార్ ఆదివారం వెల్లడించారు. కడప జిల్లా ఖాదర్ పల్లికి చెందిన నిందితులు రింగుల బాషా, హబీబుల్లా, సాదిక్, షేక్ షఫీపై కేసు నమోదు చేశామన్నారు. వారి వాహనంలో తనిఖీ చేయగా 240 బాక్సుల మద్యం బాటిళ్లు బయటపడ్డాయన్నారు. వాహనాన్ని, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాటిళ్ల విలువ రూ.14,51,520 ఉంటుందని తెలిపారు.

News April 7, 2024

పోలాకి: వాహన తనిఖీలలో రూ.78 వేల నగదు స్వాధీనం

image

పోలాకి మండలం జడూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న వాహన తనిఖీలలో భాగంగా నగదు స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రాజు తెలిపారు. ఆదివారం అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు. పోలాకి వద్ద ఆటోలో ప్రయాణం చేస్తున్న ఒక మహిళ వద్ద నుంచి రూ. 78 వేల నగదు ఎటువంటి అనుమతులు రసీదులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నగదును నరసన్నపేట ఎన్నికల అధికారికి అప్పగించామన్నారు.

News April 7, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు అన్‌రిజర్వడ్ స్పెషల్ రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్)కు అన్‌రిజర్వడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.06077 ట్రైన్‌ను ఈ నెల 13, 20, 27 తేదీలలో చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News April 7, 2024

కడప: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

మండల కేంద్రమైన సిద్దవటం ఎగువపేటకు చెందిన సోమిశెట్టి రంజిత్(32) అనే యువకుడు పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సిద్దవటం ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. యువకుడికి వివాహం కాలేదని దీంతో మనస్తాపం చెందడని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తన బైక్‌ పై పురుగు మందు తీసుకెళ్లి నిత్యపూజ కోనకు వెళ్లే రహదారిలో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు.