Andhra Pradesh

News April 7, 2024

ఏలూరు: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు రైల్వే‌గేట్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని రైల్వే పట్టాలపై ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. రైల్వే రైటర్ ఆదినారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

News April 7, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

image

శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కుమార్తె ప్రియ(6) మృత్యువాత పడగా, కుమారుడికి, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి శ్రీకాకుళం నుంచి కడపలోని రైల్వే కోడూరు స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో వారు బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున నిద్ర మత్తులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

News April 7, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,561 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 923 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

News April 7, 2024

ఎన్నికల వేళ సమర్థవంతంగా పని చేయండి: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమర్ధవంతంగా పనిచేయాలని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ సిబ్బందికి సూచించారు. ఆదివారం సాయంత్రం గుంతకల్లు సబ్ డివిజన్ సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రశాంత ఎన్నికల కోసం సబ్ డివిజన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికలలో జరిగిన ఘటనలు, ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులను సమీక్షించారు.

News April 7, 2024

మెంటాడ:కుక్క దాడిలో 13 గొర్రె పిల్లలు మృతి

image

మెంటాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం శాలలో ఉన్న గొర్రె పిల్లలపై ఓ కుక్క దాడిచేసింది. ఈ దాడితో 13 గొర్రె పిల్లలు మృతిచెందాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే రెండోసారి కుక్క గొర్రెలపై దాడి చేసిందని రైతు వాపోయాడు. వీటి విలువ సుమారు రూ.50,000 ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

News April 7, 2024

గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు (07169) ఈనెల 14, 21, 28 తేదీల్లో నర్సాపూర్‌లో 18.00 గంటలకు బయలుదేరి, విజయవాడ 21, 35, గుంటూరు 22: 45 సత్తెనపల్లి 23.24, పిడుగురాళ్ల 23: 56 సికింద్రాబాద్ 04.50 గంటలకు చేరుతుంది.

News April 7, 2024

చిత్తూరు: ఎంపీపీపై మరోసారి దాడి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ఎంపీపీ లక్ష్మీనరసమ్మపై <<13008228>>వాలంటీర్ <<>>ఆదివారం రెండోసారి దాడి చేశాడు. బాధితురాలి వివరాల మేరకు.. బుచ్చిరెడ్డిపల్లికి చెందిన వాలంటీర్ నరేశ్ గ్రామంలో చెట్లు నరికేశాడని ఎంపీపీ లక్ష్మీనరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాలంటీరు ఆమె కుటుంబ సభ్యులపై శనివారం దాడి చేసి గాయపరిచాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎంపీపీ తన ఇంట్లో ఒంటరిగా ఉండడంతో మరోమారు దాడి చేశాడు.

News April 7, 2024

కర్నూలు జిల్లాలో పిడకల సమరం.. ఎందుకో తెలుసా?

image

ఆస్పరి మండలం కైరుప్పలలో ఉగాది తర్వాతి రోజు పిడకల సమరం జరుగుతుంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి ఆయనను పిడకలతో కొట్టాలని చూస్తారు. వీరభద్రుడిని అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని భక్తులు వేడుకున్నా.. అటువైపు వెళ్లడంతో ఆయనపై పిడకలతో దాడిచేశారు. స్వామివారి భక్తులు కూడా పిడకలతో అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని చెబుతుంటారు.

News April 7, 2024

ప్రజలు ఓట్లు వేసింది హత్యలు చేసేందుకా: షర్మిల

image

ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని ఆమె ఆరోపించారు. భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

News April 7, 2024

అనకాపల్లి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో అనకాపల్లి చేరుకున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనకాపల్లి పట్టణం నెహ్రు చౌక్ వద్ద ఎన్డీఏ శ్రేణులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.