Andhra Pradesh

News August 24, 2025

శ్రీకాకుళం జిల్లాలో(ఎస్‌ఏ) ఇంగ్లిష్ ఫస్ట్ ర్యాంక్‌ బూర్జ వాసికే

image

ఇటీవల విడుదలైన 2025 డీఎస్సీ ఫలితాల్లో బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన మీసాల గోవిందరావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విజయం పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు , స్నేహితులు గోవిందరావును అభినందించారు.

News August 24, 2025

మైలవరం: 33 ఏళ్ల లీజుకు 1200 ఎకరాలు

image

కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు 1200 ఎకరాలను లీజు ప్రాతిపదికను కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దొడియంలో 1105.69 ఎకరాలు, వద్దిరాలలో 94.36 ఎకరాల ప్రభుత్వ భూములను 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. సోలార్ పరిశ్రమతో ఉద్యోగాలు వస్తాయని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

News August 24, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు అనంతపురం ఎస్పీ కీలక సూచనలు

image

సివిల్, APSP కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్పీ జగదీశ్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 25న జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 8 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో పాటు జతపరచిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు.

News August 24, 2025

విశాఖలో పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 122 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News August 24, 2025

అనంతపురం JNTUకు ఆరు ISO సర్టిఫికెట్లు

image

అనంతపురం జేఎన్టీయూ ఆరు ISO సర్టిఫికెట్లు అందుకుంది. ఈ మేరకు శనివారం ISO బృంద సభ్యులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావుకు అందజేశారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో యూనివర్సిటీని మరింత మెరుగైన ప్రమాణాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

News August 24, 2025

ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం వెల్లడించారు. గణేశ్ మండపాలకు, ఊరేగింపులకు సింగిల్ విండో విధానంలో నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఒకరిని కాపలా ఉంచాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విపరీతమైన డీజే సౌండ్‌లను అనుమతించబోమని పేర్కొన్నారు.

News August 24, 2025

కీలక మలుపు తిరిగిన కరేడు రైతు ఉద్యమం

image

రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్‌లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది.

News August 24, 2025

విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు

image

ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకం చేపడుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనాయుడు శనివారం వెల్లడించారు. స్త్రీ శక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, మద్దిలపాలెం, గాజువాక, వాల్తేర్, స్టీల్ సిటీ, సింహాచలం, మధురవాడ డిపోలలో నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఆసక్తి గల వారు ఆయా డిపోల్లో సంప్రదించాలన్నారు.

News August 24, 2025

పాలకోడేరు పీహెచ్సీనలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

image

పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. గీతాబాయి ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవం అయిన మహిళను ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ గులాం రాజ్ కుమార్, స్వర్ణ నిరంజని ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

News August 24, 2025

‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను (KPI) ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు, వాటి సాధనపై ఆమె సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.