Andhra Pradesh

News April 7, 2024

టెక్కలి: జాతీయ రహదారిపై లారీ ఢీకొని వృద్ధుడు మృతి

image

టెక్కలి మండలం అక్కవరం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం లారీ ఢీకొని ముంజేటి గురయ్య(70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యాంసుందరపురం గ్రామంలోని తన కుమార్తెను చూసి తిరిగి వస్తున్న క్రమంలో అక్కవరం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వెళ్తున్న గుర్తుతెలియని ఓ లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు.

News April 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ని వదులుకునే ప్రసక్తే లేదు: బొత్స ఝాన్సీ

image

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ని వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, గాజువాక అభ్యర్థి గుడివాడ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

News April 7, 2024

రంగును బట్టి రాజకీయాల్లోకి లాగొద్దు: ఏసీ

image

బ్లూ షర్ట్ వేసుకున్నానని వైసీపీ, పసుపు కండువా కప్పుకున్నానని టీడీపీ, రోజూ బొట్టు పెట్టుకుంటానని బీజేపీ అనొద్దని, తనకు రాజకీయాలు అంటగట్టొద్దని దివంగత ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మహానాయకులు , పెద్దనాయకులు చాలా మంది ఉన్నారన్నారు. నెల్లూరు కోటమిట్టలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 7, 2024

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత పెదపారుపూడిలో నమోదు

image

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత పెదపారుపూడిలో నమోదు అయింది. ఆదివారం పెదపారుపూడిలో 43.58 డిగ్రీలు నమోదు అయింది. కంకిపాడులో 41.75 డిగ్రీలు, బాపులపాడులో 41.64 డిగ్రీలు, గుడివాడ మండలం మెరకగూడెంలో 41.51 డిగ్రీలు, పెద్ద అవుటుపల్లిలో 41.42 డిగ్రీలు, నందివాడలో 41.17 డిగ్రీలు, ఉంగుటూరు మండలం నందమూరులో 41.0 డిగ్రీలు నమోదు అయింది. పామర్రులో 40, తేలప్రోలులో 39.75 డిగ్రీలు, పోలుకొండలో 39.5 డిగ్రీలు నమోదైంది.

News April 7, 2024

చంద్రబాబుకు మంత్రి అమర్నాథ్ సవాల్

image

బీజేపీతో జతకట్టిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పగలరా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. గాజువాక మండలం నడుపూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు.

News April 7, 2024

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ మృతి

image

చిలకలూరిపేట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ బొగ్గల వరపు వీరయ్య ఆదివారం కన్ను మూశారు. ఇటీవల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వీరయ్య గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర నంతరం ఆరోగ్యం మెరుగుపడినా శనివారం సాయంత్రం మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

News April 7, 2024

విశాఖ: ఫార్మా కంపెనీలో ప్రమాదం.. ఇద్దరు మృతి

image

పరవాడ <<13006707>>ఫార్మాసిటీ<<>>లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆల్కాలి మెటల్ కంపెనీలో గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన సీహెచ్.రమణ(33), అరబిందో కంపెనీలో పెదగంట్యాడలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన ఆల్ల గోవింద్(34) ప్రాణాలు విడిచారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని CITUనాయకులు డిమాండ్ చేశారు.

News April 7, 2024

ప.గో.: ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ విజయం.. ఈ సారి..?

image

చింతలపూడిలో రాజకీయం ఆసక్తిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కొత్తఅభ్యర్థి కంభం విజయరాజుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కాదని కొత్త అభ్యర్థి సొంగా రోషన్‌ను ప్రకటించింది. అయితే నియోజకవర్గ ఓటర్లు 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు అధికారం కట్టబెడుతూ వచ్చారు. మరి ఈ సారి ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.

News April 7, 2024

కొండాపురం: బోల్తాపడ్డ ట్రాక్టర్.. దూకేసిన కూలీలు

image

కొండాపురం మండలం పార్లపల్లి సమీపంలోని పొలాల్లో పొగాకు లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఆ సమయంలో ట్రాక్టర్ లో 15 మంది కూలీలు ఉన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాళ్లు వెంటనే కిందికి దూకి తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. లోడుతో ఉన్న ట్రాక్టర్ పొలంలోంచి రోడ్డుపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అక్కడున్న వారు తెలిపారు.

News April 7, 2024

అనంతపురం జిల్లాలో భానుడి ప్రతాపం

image

ఉమ్మడి అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఈ ఏడాది లోనే తొలిసారి 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, శింగనమలలో 44.0 డిగ్రీలు, గుంత కల్లు, కదిరిలో 43.5, పుట్లూరు, చెన్నేకొత్తపల్లి 43.4, ధర్మవరం 43.3, సెట్టూరు, పుట్టపర్తి 43.0, తలుపుల 42.9, యల్లనూరు 42.7, కూడేరు 42.6, అనంతపురం 42.5, ఉష్ణోగ్రత నమోదైంది.