Andhra Pradesh

News April 7, 2024

హెలిపాడ్ సిద్ధం.. పవన్‌కళ్యాణ్ షెడ్యూల్ ఇదే

image

అనకాపల్లిలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ విశాఖ హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి వారాహి వాహనం మీద ఊరేగింపుగా పట్టణంలోకి వస్తారు. చాపల బజార్, నాలుగు రోడ్లు జంక్షన్, బండి గాడి వీధి, శ్రీకన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి జంక్షన్, ఎన్టీఆర్ విగ్రహం, నెహ్రూ చౌక్ జంక్షన్ వద్దకు చేరుకుంటారు. 6 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

News April 7, 2024

రొంపిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

మండలంలోని అన్నవరప్పాడు బ్రిడ్జి వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు అన్నవరప్పాడు వెళ్తుండగా బ్రిడ్జి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలశౌరి అక్కడికక్కడే మృతి చెందిగా, వెంకటేశ్వర్లు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

News April 7, 2024

ఫార్మా కంపెనీలో ప్రమాదం.. విజయనగరం జిల్లా వ్యక్తి మృతి

image

పరవాడ <<13006759>>ఫార్మాసిటీ<<>>లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆల్కాలి మెటల్ కంపెనీలో గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన సీహెచ్.రమణ(33), అరబిందో కంపెనీలో పెదగంట్యాడలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన ఆల్ల గోవింద్(34) ప్రాణాలు విడిచారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని CITUనాయకులు డిమాండ్ చేశారు.

News April 7, 2024

ప.గో.: ఆయన గెలిచిన ప్రతిసారి కొత్తపార్టీ నుంచే..

image

భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు ఓ ప్రత్యేకతను కైవసం చేసుకున్నారు. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. గతంలో 2 వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందిన ఆయన తాజాగా మరోపార్టీ నుంచి బరిలో ఉన్నారు.

News April 7, 2024

మదనపల్లె: చెరువులో పడిపోయిన బొలెరో

image

మదనపల్లె సమీపంలోని తట్టివారిపల్లి చెరువులో బొలెరో వాహనం పడిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. మండలంలోని, సీటీఎంరోడ్డు తట్టివారిపల్లి చెరువులోకి ఓ బొలెరో వాహనం దూసుకెళ్లింది. డ్రైవర్ తాగిన మైకంలో వాహనం నడిపడంతో బొలెరో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 7, 2024

ఒంగోలు రైల్వే ట్రాకుపై వ్యక్తి మృతి

image

ఒంగోలు రైల్వే స్టేషన్ కొత్తపట్నం ఫ్లైఓవర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ట్రాకుపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించి రైల్వే అధికారులకు కొందరు సమాచారం అందించారన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను రాబట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

అనంతపురంలో టైలరింగ్ ఉచిత శిక్షణ

image

అనంతలోని రూడ్సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటీ పార్లర్ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చెందిన వారు 19 నుంచి 45 సం. వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 7, 2024

వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

image

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 7, 2024

బ్యాడ్మింటన్ ఆడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడాకారులతో పాటు వాకర్స్ వారిని చప్పట్లతో ప్రోత్సహించారు.

News April 7, 2024

కర్నూలు: వెటర్నరీ అంబులెన్స్ డ్రైవర్ పోస్టుల భర్తీ

image

కర్నూలు పశుసంవర్ధక శాఖ, ఆరోగ్య సేవ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ (1962)లలో డ్రైవర్(పైలెట్) పోస్టులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని జీవీకే ఈఎంఆస్ఐ జిల్లా మేనేజర్ రామకృష్ణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 36 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www.ahd.gov.in సంప్రదించాలన్నారు.