Andhra Pradesh

News April 7, 2024

సీఎం రమేశ్‌కు 41ఏ నోటీసులు

image

అనకాపల్లి ఎన్డీఏ MP అభ్యర్థి సీఎం రమేశ్‌కు పోలీసులు శనివారం రాత్రి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఇటీవల చోడవరంలోని ఓ టైల్స్ షాప్‌లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. సీఎం రమేశ్ అక్కడికి చేరుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సీఎం రమేశ్, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజుతో పాటు ఆరుగురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

News April 7, 2024

వంశధార నదిలో అడుగంటిపోతున్న జలాలు

image

వేసవి కాలం ఆరంభం కావడంతో వంశధార నీటి జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నదులు జల కళను కోల్పోతున్నాయి. తీర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వంశధార ప్రాజెక్టుకు సైతం నీటి జాడలు తగ్గిపోతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న దాంట్లో 150 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా అధికారులు విడిచిపెడుతున్నారు.

News April 7, 2024

తవణంపల్లెలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో శనివారం అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పులిచెర్లలో 43.6, ఎస్ఆర్ పురం 42.9, విజయపురం, నగరి, నిండ్ర 42.8,పుంగనూరు, బంగారుపాళ్యం 41.5,సోమల 41.4,చిత్తూరు, సదుం 41.2,పాలసముద్రం, గుడిపల్లె 41,కుప్పం 40.9,చౌడేపల్లె, యాదమరి,రొంపిచెర్ల, ఐరాల 40.8, జీడీనెల్లూరు, వెదురుకుప్పం 40.7,కార్వేటినగరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News April 7, 2024

పులివెందుల అడ్డా ఈసారి ఎవరిది.?

image

రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల ప్రత్యేకం. ఇక్కడ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 13 సార్లు YS కుటుంబానిదే పెత్తనం. YS కుటుంబంపై 5 సార్లు పోటీచేసిన సతీశ్ రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ మెజారిటీ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నారు. TDP అభ్యర్థి బీటెక్ రవి గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఎవరు గెలుస్తారు?

News April 7, 2024

ప.గో.: ఎన్నికల సిత్రం.. గారెలు, బజ్జీలు వేసిన MLA అభ్యర్థి

image

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని మలకపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన ఓ టిఫిన్ సెంటర్‌లో గారెలు, బజ్జీలు వేశారు.

News April 7, 2024

కృష్ణా: బీటెక్ విద్యార్థులకు అలర్ట్..

image

కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన బీటెక్ 5, 7వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చన్నారు.

News April 7, 2024

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి

image

కొరిసపాడు మండలంలోని పి.గుడిపాడులోని ఆశ్రమ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి రైల్వేకోడూరు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనగా, అనంతరం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు సంవత్సరాల పాప అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన వారికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

హిందూపురం: పోలీసులపై దాడి

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని హుస్నాబాద్ సమీపంలోని ఓ వర్గం శ్మశాన వాటిక వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘర్షణ చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. బందోబస్తుకు వెళ్లిన ఏఎస్ఐ, పలువురు కానిస్టేబుల్ లపై ఆందోళన కారులు దాడులు నిర్వహించారు. దీంతో గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించారు.

News April 7, 2024

కడప: నేడు షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్

image

కడప జిల్లాలో 3వ రోజు APCC చీఫ్& కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర కొనసాగనుంది. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఉదయం 10.30 గంటలకు పర్యటన ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపారు. Ck దిన్నె, ఎల్లటూరు, పెండ్లిమర్రి, నందిమండలం, తంగేడుపల్లి, వీఎన్ పల్లి, కమలాపురం, వల్లూరు, చెన్నూరు మీదుగా న్యాయ యాత్ర జరగనుంది.

News April 7, 2024

కర్నూలు: డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను VCసుధీర్ ప్రేమ్కుమార్ ఆదేశాలతో విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3 సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 5,900 మందికిగాను 3,081 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 9,140 మందికి 4,182 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలు rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.