Andhra Pradesh

News April 7, 2024

శ్రీకాకుళం: ఉపాధి కూలీల వేతనం రూ.300 కు పెంపు

image

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి కొత్త వేతనం అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ప్రస్తుతం వారికి రోజుకు రూ.272 అందుతున్న కూలీ రూ.300కు పెరగనుందని చెప్పారు. సోమవారం నుంచి జిల్లాలో 1.82 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతారని అన్నారు. ఉపాధి పనులు ఆయా ఎంపీడీవోలు, ఏపీడీలు పర్యవేక్షించాలన్నారు.

News April 7, 2024

ఒంగోలు: 59 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు

image

ఒంగోలు నగరంలోని కేంద్రియ విద్యాలయంలో ఈ నెల 5న సార్వత్రిక ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు జిల్లాలోని పీవోలు, ఏపీవోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే పలువురు అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాలేదు. విషయం కలెక్టర్ దినేశ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో జిల్లాలోని 59 మంది పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ శనివారం సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

News April 7, 2024

ఉండి టికెట్ RRRకేనా..? మీ కామెంట్..?

image

టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పాలకొల్లులో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉండి MLA అభ్యర్థిగా సిట్టింగ్ MLA మంతెనను కాదని RRRకు కేటాయించినట్లు వార్తలు రావడంతో మంతెన అభిమానులు బాబు కాన్వాయ్ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ తర్వాత టికెట్‌పై పూర్తి క్లారిటీ ఇవ్వలేదని మంతెన, RRR వేర్వేరుగా మీడియాతో వెల్లడించారు. దీంతో సందిగ్ధత నెలకొంది.
– మీ కామెంట్..?

News April 7, 2024

పిచ్చాటూరు: ఆస్తికోసం అవ్వను చంపిన మనవడు అరెస్టు

image

పిచ్చాటూరు మండలంలో నాలుగు రోజుల క్రితం ఆస్తికోసం రాజమ్మను చిన్న కుమారుడు కృష్ణారెడ్డి, ఆమె మనవడు ఇళంగోవర్ రెడ్డి, కోడలు గౌరీ అతి దారుణంగా గొంతు కోసి చంపారు. వీరిలో మనవడు ఇళంగోవర్ రెడ్డిని శనివారం సీఐ భాస్కర్ నాయక్, ఎస్సై వెంకటేశ్వర్లు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కృష్ణారెడ్డి, గౌరీ లను, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

News April 7, 2024

దుక్కిపాటి విజయచంద్రకు పి.గన్నవరం టికెట్

image

కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ దుక్కిపాటి విజయచంద్రను ప్రకటించింది. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ తనను ఎంపిక చేశారని వెల్లడించారు. ఐ.పోలవరం మండలం ఎదుర్లంక గ్రామ పరిధి రామాలయ పేటకు చెందిన విజయచంద్ర బీటెక్ చదివారు.

News April 7, 2024

విశాఖ: ఓటు బదిలీకి కేఏ పాల్ దరఖాస్తు

image

విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తన ఓటును విశాఖకు బదిలీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతేడాది తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఇప్పుడు ఏపీకి వచ్చారు. నగరంలోని శ్రీకన్య థియేటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తన ఓటును విశాఖ ఉత్తర నియోజకవర్గానికి బదిలీ చేయడానికి దరఖాస్తు చేసినా, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

News April 7, 2024

విశాఖ: హత్య కేసులో వాలంటీర్ అరెస్టు

image

పాయకరావుపేట మండలంలోని పెద్దరామ భద్రపురం హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 11న గ్రామంలో తలెత్తిన వివాదంలో గంపల నూకరాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు పాల్పడిన వారిలో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న పాయకరావుపేటకు చెందిన గ్రామ వాలంటీర్ పెద్దాడ గాంధీని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News April 7, 2024

విజయవాడ: రూ.కోటి కథనంపై సీపీ వివరణ

image

విజయవాడలో పోలీసులు రూ.కోటి బంగారం కొట్టేశారనే వార్త అవాస్తవమని పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సత్యనారాయణపురం పరిధిలో, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి బంగారం దొరకలేదని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News April 7, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తి

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తయింది. 99% మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లను అందజేశారు. విశాఖ జిల్లాలో 1,65,432 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,63,553 మందికి అందజేశారు. అనకాపల్లి జిల్లాలో 2,66,208 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,63,232 మందికి పంపిణీ చేశారు. అల్లూరి జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 1,27,894 మంది కాగా 1,26,573 మందికి పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 7, 2024

రాజాంలో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరు అరెస్టు

image

రాజాంలోని క్రికెట్ బెట్టింగ్‌‌‌కు పాల్పడుతున్న తెలగవీధి, పుచ్చలవీధికి చెందిన ఇద్దరు వ్యక్తుపై కేసు నమోదు చేసి రూ.18,500 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజాం టౌన్ సీఐ మోహనరావు శనివారం రాత్రి తెలిపారు. బెట్టింగ్ నిర్వహణకు సంబంధించిన పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బెట్టింగ్‌‌కు పాల్పడిన, అసాంఘిక చర్యలు జరిగినా వెంటనే డయల్‌ 100 సమాచారం ఇవ్వాలన్నారు.