Andhra Pradesh

News April 7, 2024

విశాఖ: అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల సాగు

image

జిల్లాలో మొత్తం 777 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, వీటిలో 190 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. తొలి దశలో 42 కేంద్రాలకు రూ.10 వేలు చొప్పున కూరగాయల మొక్కల పెంపకానికి కేంద్రం నిధులను మంజూరుచేసింది. రెండో విడత మరికొన్ని కేంద్రాలకు విడుదల చేయనుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం పరిధిలో కాయగూరలు పండించనున్నారు. వీటిని అదే కేంద్రాల్లో వంటకు వినియోగించనున్నారు. నిర్వహణ బాధ్యతను పూర్తిగా ఆయాలు చూడాలి.

News April 7, 2024

ప.గో.: టీడీపీకి షాక్.. బీసీ నేత రాజీనామా

image

ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్‌ చలమోలు అశోక్‌ గౌడ్‌ శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే తప్ప పల్లకీలు మోసే బోయలు కాదని అన్నారు. 

News April 7, 2024

సింహాచలం: 18 నుంచి అప్పన్న వార్షికోత్సవ కల్యాణోత్సవాలు

image

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం నిర్వహణ తదితర అంశాలపై చర్చించామని తెలిపారు.

News April 7, 2024

ఆత్మకూరు: ఎలుగుబంటిని చంపిన నలుగురి అరెస్ట్

image

ఆత్మకూరులో విద్యుత్ కంచె వేసి ఎలుగుబంటిని చంపిన నలుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎఫ్ఎ సాయిబాబా తెలిపారు. పట్టణ సమీపంలోని సూర్య గార్డెన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వేటగాళ్లుగా బయటపడిందన్నారు. వారి నుంచి ఎలుగుబంటి తల, అవయవాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వేటగాళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు .

News April 7, 2024

ANU: పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10వ తేదీ నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేశామని సీఈ ఆర్‌ ప్రకాశరావు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News April 7, 2024

పార్వతీపురం: ఈ నెల 20న ఈఎంఆర్ఎస్ ప్రవేశపరీక్ష

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష వాయిదా పడినట్లు ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ తెలిపారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్-2 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20కు పరీక్ష వాయిదా వేసినట్లు తెలిపారు.

News April 7, 2024

రాయచోటి రమేశ్‌రెడ్డితో YCP నేతల చర్చలు

image

రాయచోటి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అర్.రమేశ్ కుమార్ రెడ్డిని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రమేశ్ రెడ్డిని వైసీపీలోకి చేరడానికి పూర్తి స్థాయి చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో ఆయన కూడా వైసీపీలో చేరడానికి సుముఖత చూపడంతో అతి త్వరలో తేదీన ప్రకటించి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు.

News April 7, 2024

కృష్ణా: ఆ 2 చోట్లా జనసేనకు గణనీయంగా ఓట్లు

image

2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో JSP అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణకు అవనిగడ్డ, పెడనలో 24 వేలకు పైబడి ఓట్లు లభించాయి. నియోజకవర్గాల వారీగా రామకృష్ణకు వచ్చిన ఓట్లలో అవనిగడ్డలో 24,594, పెడనలో 24,134 ఓట్లు రాగా, అత్యల్పంగా పామర్రులో 8,615 ఓట్లు లభించాయి. తాజా ఎన్నికల్లో జనసేన నుంచి బాలశౌరి పోటీ చేస్తుండగా ఈ రెండు నియోజకవర్గాలలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లాలో ఆసక్తి నెలకొంది.

News April 7, 2024

కొమరోలు: అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

image

కొమరోలులోని చర్చి వీధిలో నివాసం ఉంటున్న గర్భిణీ ప్రసన్న (30) అనుమానాస్పద స్థితిలో శనివారం సాయంత్రం మృతి చెందింది. ఆమె భర్త నారాయణ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న బాత్రూంలో జారిపడి మృతి చెందినట్లుగా భర్త నారాయణ తెలిపాడు. ప్రసన్నను భర్త చంపి ఉంటాడని ఆమె తమ్ముడు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 7, 2024

విశాఖ: కత్తిపోట్లతో బాలుడు మృతి.. ఆరుగురు అరెస్ట్

image

మాధవధారలో పాత కక్షల నేపథ్యంలో గురువారం కత్తిపోట్లకు గురైన అంబేడ్క‌ర్ కాలనీకి చెందిన మూగ బాలుడు తేజ (17) రెండు రోజులపాటు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతికి కారణమైన ఉదయకుమార్, రాజకుమార్, జగదీష్, శివశంకర్, సన్యాసిరావులపై శనివారం ఎయిర్ పోర్టు పోలీసులు హత్య కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఆరో వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించారు.