Andhra Pradesh

News April 7, 2024

ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: జిల్లా ఎస్పీ

image

ఎన్నికలకు అన్నిరకాల పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టామని
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతపురం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల సంసిద్ధత, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ఠంగా అమలు, ముందస్తు ఏర్పాట్లు, తదితర అంశాలపై కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 7, 2024

గణపవరంలో రూ.79 వేల నగదు పట్టివేత

image

గణపవరంలో ఎస్ ఎఫ్ టి టీమ్ అధికారులు వాహనాల తనిఖీల్లో రూ.79000 స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగదుకు తగిన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసి ట్రెజరీకి పంపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల పైబడి నగదుతో ప్రయాణించేవారు అందుకు తగిన ఆధారాలను తనిఖీ అధికారులకు చూపించి సహకరించాలని రిటర్నింగ్ అధికారి ఖాజావలి విజ్ఞప్తి చేశారు.

News April 7, 2024

ఎన్నికల నియమావళిని పాటించాలి: సబ్ కలెక్టర్

image

కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి శనివారం సమావేశం నిర్వహించారు. నేతలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పార్టీ కరపత్రాలపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. కందుకూరులో 55 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి భద్రత పెంచామని సబ్ కలెక్టర్ తెలిపారు.

News April 7, 2024

పార్వతీపురం: ‘నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి’

image

సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించుటకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీ చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు.

News April 7, 2024

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా, కేంద్ర సాయిధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

News April 7, 2024

సీ విజిల్ ఫిర్యాదుల ప‌రిష్కారం: డిల్లీరావు

image

సీ-విజిల్ యాప్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి గ‌డువులోగా అత్యంత క‌చ్చిత‌త్వంతో ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. శనివారం స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, క‌లెక్ట‌ర్లు, సీపీలు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

News April 6, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం: ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ప్రాంతాలలో పోలీసు కవాతు నిర్వహించామని ఎస్పీ జి.కృష్ణకాంత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, గ్రామాల్లో ఎన్నికల దృష్ట్యా అల్లర్లు జరగకుండా పోలీసులు కవాతు నిర్వహించారన్నారు.

News April 6, 2024

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విజయవాడ సీపీ కాంతి రానా టాటా

image

ఇటీవలి కాలంలో కొన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్‌లో ఐపీఎస్ అధికారులపై వచ్చిన అవాస్తవ కథనాలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, విజయవాడ సీపీ కాంతి రానా టాటా అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాని కలిసి ఈ ఘటనలపై రవీంద్రబాబు ఐపీఎస్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఈ ఘటనలు జరగకుండా నియంత్రించాలని కాంతి రానా టాటా కోరారు.

News April 6, 2024

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి

image

దమ్మపేట మండలం మందలపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన చీపు లక్ష్మి(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ(35)కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 6, 2024

సాంకేతికతను వినియోగించి సైబర్ క్రైమ్‌ను అరికట్టాలి: సీపీ

image

వేగంగా విస్తరిస్తున్న సైబర్ క్రైమ్‌కు సాంకేతికతను వినియోగించి అడ్డుకట్ట వేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రించేందుకు అత్యాధునిక సాంకేతికత వినియోగంపై విశాఖలో నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్ షాప్‌ను కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 90 మంది సిబ్బందిని వర్క్ షాప్‌కు ఎంపిక చేశామన్నారు.