Andhra Pradesh

News April 6, 2024

శ్రీకాకుళం: కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మందస మండలం చిక్కిడిగాం గ్రామంలో చోటుచేసుకుంది. భర్త కృష్ణ జీడి తోటకు వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, కడుపు నొప్పి తీవ్రంగా ఉందంటూ భార్య సంగీత చెప్పింది. ఏమైందని కృష్ణ అడగగా కడుపునొప్పి తాళలేక గన్నేరు పప్పు తాగానని తెలపడంతో వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది.

News April 6, 2024

590 కిలోల గంజాయి స్వాధీనం

image

రోలుగుంట మండలం పెదపేట గంగాలమ్మ దేవాలయం సమీపంలో రోలుగుంట రావికమతం పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గంజాయిని రవాణాకు సిద్ధం చేసినట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ రూ.30.40 లక్షలు ఉంటుందన్నారు.

News April 6, 2024

మాచర్ల: చేపల వేటకు వెళ్లి.. మత్యకారుడి మృతి

image

మండలంలోని అనుపులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్‌లోని డౌన్ మార్కెట్‌కు చెందిన బొందు తాతారావు(50) అనుపు వద్ద కృష్ణా నదిలో చేపలను పడుతుండగా.. ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నదిలో కొట్టుకుపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు గాలించగా తాతారావు అనుపు వద్ద కృష్ణా జలాశయంలో శవమై తేలియాడుతూ కనిపించాడు.

News April 6, 2024

ఇండియా కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పి మురళి

image

ఇండియా కూటమి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి పోటీ చేయనున్నారు. మురళి పేరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం ప్రకటించారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ తొమ్మిది మంది ఆశావహులు పోటీ పడగా చివరకు సీపీఐ టికెట్‌ను దక్కించుకుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి, వైసీపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎన్నికల బరిలోకి దిగింది.

News April 6, 2024

కోవూరు: ఒకే వేదికపైకి నల్లపరెడ్డి సోదరులు

image

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోవూరు మీదుగా వెళ్లిన సందర్భంగా నల్లపరెడ్డి సోదరులు ఒకే చోట కనిపించారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజేంద్రకుమార్ రెడ్డి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ దశలో రాజేంద్ర రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరిగింది. ఈ క్రమంలో అందరూ కలవడంపై నల్లపరెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News April 6, 2024

సాలూరు: యువతి అనుమానస్పద మృతి

image

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన సాలూరులో తీవ్ర కలకలం రేపింది. దండిగాంకు చెందిన యువతిని పని చేయడంలేదని తల్లి మందలించడంతో సుమురుగా 25 రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. శనివారం గ్రామ సమీపంలో అడవిలో యువతి అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. వస్తువులు ఆధారంగా యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ MV. రమణ తెలిపారు.

News April 6, 2024

తాళ్లపూడి: లోయలో పడ్డ యాసిడ్ ట్యాంకర్

image

తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది‌. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

News April 6, 2024

తాళ్లపూడి: లోయలో పడ్డ యాసిడ్ ట్యాంకర్

image

తాళ్లపూడి మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూడి నుంచి రాజమండ్రి వైపు యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గోదావరి గట్టుపై నుంచి లోయలోకి పల్టీ కొట్టింది‌. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ట్యాంకర్‌ను బయటకు తీసి యాసిడ్‌ను మరో ట్యాంకర్ ద్వారా రాజమండ్రికి తరలించారు.

News April 6, 2024

పాడేరు: ఎన్నికల ఫిర్యాదులకు అదనంగా మరో 3 నంబర్లు

image

రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులకు ప్రస్తుతం ఉన్న 1950 టోల్ ఫ్రీ నంబరుతో పాటు మరో మూడు ల్యాండ్ లైన్ నంబర్లను అదనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ఎన్నికల నిభందనలు ఉల్లంఘన, బహుమతులు, నగదు పంపిణీ, అక్రమ తరలింపు, మత్తు పదార్ధాల పంపిణీ, తరలింపు, తదితర ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రజలు 08935-299934, 08935-299912, 08935 -293448 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 6, 2024

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని జిల్లా డాక్టర్ సృజన అధికారులను కోరారు. సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.