Andhra Pradesh

News April 6, 2024

నరసన్నపేటలో రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నరసన్నపేటలో జరిగింది. మండలంలోని సుందరాపురం పంచాయతీకి చెందిన మురపాక గౌరమ్మ(80) ఇటీవల ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెంలో ఉంటున్న ఆమె కూతురు ఇంటికి వెళ్లింది. శనివారం గౌరమ్మ తన కుమార్తె, అల్లుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా.. వీఎన్‌పురం రహదారిపై ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరమ్మ మృతి చెందింది.

News April 6, 2024

నూతన కలెక్టర్‌ని కలిసిన రిటర్నింగ్ అధికారులు

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా నూతన కలెక్టర్, ఎన్నికల అధికారి డా.వి.వినోద్ కుమార్‌ని శనివారం రాయదుర్గం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని కరుణకుమారి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వి.శ్రీనివాసులు రెడ్డి, రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

News April 6, 2024

కావలి: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన సీఎం

image

కావలిలో శనివారం జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, అబ్దుల్ ఖలీల్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ లను ఆశీర్వదించాలని కోరారు.

News April 6, 2024

అల్లూరి జిల్లా: పిడుగుపాటుకు 3 పాడి పశువులు మృతి

image

అనంతగిరి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం వర్షంతో ఉరుములు, మెరుపులు, పిడుగుల ధాటికి 3 పాడి పశువులు మృతిచెందాయి. టోకూరు పంచాయతీ రాయివలస గ్రామానికి చెందిన గుజ్జెల మంగళ, సొంటరీ రామన్న, సోంపి సన్యాసి అనే రైతుల పాడి పశువులు మృతిచెందాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచ్ కిల్లో మోస్య మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. వారితో పాటు సీపీఎం నాయకులు దేవన్న, తదితరులు ఉన్నారు.

News April 6, 2024

ఉండి టికెట్ నాకేనని CBN చెప్పలేదు: ఎంపీ RRR

image

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉండి MLA టికెట్ తనకేనని చంద్రబాబు చెప్పలేదు. రామరాజుకేనని కూడా చెప్పలేదు. తప్పకుండా పోటీలో ఉంటా. నేను కండీషన్లు పెట్టి టీడీపీలో చేరలేదు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. MPగా పోటీ చేస్తానా..? MLAగానా..? అనేది కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారు.’ అని అన్నారు.

News April 6, 2024

నంద్యాల: రూ.5.2 లక్షల నగదు స్వాధీనం

image

మహానంది మండల పరిధిలోని గాజులపల్లి చెక్‌పోస్టు వద్ద రికార్డులు లేకుండా తీసుకువెళ్తున్న నగదు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో రూ.2.14 లక్షలు, మరో వాహనంలో రూ.2.88 లక్షలు స్వాధీనం చేసుకుని ట్రెజరీలో అప్పగించినట్లు తెలిపారు. బర్రెల వ్యాపారులు ఈ నగదు తీసుకువెళ్తున్నట్లు సమాచారం.

News April 6, 2024

పార్వతీపురం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు

image

జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు పటిష్ఠంగా జరిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాలుగు నియోజకవర్గాలలో 48 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 36 స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, 16 వీడియో సర్వేలియన్, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

News April 6, 2024

కృష్ణా: చంద్రబాబు రేపటి పర్యటన షెడ్యూల్ వివరాలు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. సభ అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గాన ఉయ్యూరు మార్కెట్ సెంటర్ చేరుకొని సాయంత్రం 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చంద్రబాబు రేపటి పర్యటనల షెడ్యూల్ విడుదల చేశాయి. 

News April 6, 2024

వైసీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు

image

3 రోజుల కింద జనసేనకు రాజీనామా చేసిన అమలాపురం ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ TDPకి ఇవ్వడంతో అసంతృప్తికి లోనయ్యారు. చివరకు ఈ రోజున వైసీపీ గూటికి చేరారు.

News April 6, 2024

ప్రకాశం: ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి

image

దొనకొండ మండలంలోని ఇండ్లచెరువులో శనివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్నెం వెంకటేశ్వర్లు, పత్తి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు యువకులు మల్లెల వాగు వద్ద భారీగా తీసిన నీటి గుంతలో ఈతకు వెళ్లి మృతి చెందారు. ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు చేపట్టారు.